కరోనా కారణంగా తగ్గిన ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేస్తోంది. ఒక్క మే నెలలోనే రూ.4,100 కోట్లు ఆదాయాన్ని కోల్పోయినట్లు ఇటీవల కేంద్రానికి తెలిపింది. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణలో భాగంగా ప్రభుత్వం, గృహనిర్మాణ సంస్థ వద్ద నిరుపయోగంగా ఉన్న భూములను విక్రయించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది.
హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ భూముల వేలానికి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అటు రుణపరిమితిని 5 శాతానికి పెంచాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో పాటు ఇతర అవకాశాలపై కూడా ఆ రాష్ట్ర సర్కార్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా నిధుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ సమావేశం కానుంది.
ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు అధికారులు సమావేశమై సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. గృహానిర్మాణ సంస్ధ పరిధిలోని భూములు, ఇండ్ల విక్రయం సహా ఇతర అంశాలపై ఉపసంఘం చర్చించనుంది.
ఇదీ చూడండి:
MP Raghurama case: గుంటూరు జిల్లా జైలు అధికారులకు సీఐడీ కోర్టు మెమో!