గోదావరి బోర్డుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో లేఖ రాసింది. జీఆర్ఎంబీ ఛైర్మన్‌కు ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. ప్రాజెక్టుల డీపీఆర్‌లు విభజన చట్టం ప్రకారమే సీడబ్ల్యూసీకి పంపాలని లేఖలో పేర్కొన్నారు. చౌటుపల్లి హన్మంతరెడ్డి లిఫ్ట్, ముక్తేశ్వర లిఫ్ట్, తుపాకుల గూడెం, మోడికుంట వాగు, సీతారామ లిఫ్ట్ కొత్తవి కావని స్పష్టం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు 967.94 టీఎంసీలు కేటాయించినట్లు లేఖలో పేర్కొన్నారు. నిర్దేశిత టీఎంసీలకు అనుగుణంగానే ప్రాజెక్టులు చేపట్టామని తెలిపారు. ఏపీ ప్రాజెక్టులపై ఏవిధమైన ప్రభావం ఉండబోదని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు చేపట్టిన ప్రాజెక్టులపై పరిశీలన అధికారం బోర్డుకు లేదని పేర్కొన్నారు. ఈ అంశాలను పరిశీలించేందుకు సీడబ్ల్యూసీలో డైరెక్టరేట్లు ఉన్నాయని గుర్తు చేశారు.
రాయలసీమ లిఫ్ట్ డీపీఆర్‌ను కృష్ణా బోర్డు సీడబ్ల్యూసీకి పంపించిందని మురళీధర్ తెలిపారు. పూర్తయిన, కొనసాగుతున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లకు అనుమతులు ఇవ్వాల్సిన బాధ్యత సీడబ్ల్యుసీదేనన్నారు. డీపీఆర్‌లకు అనుమతి అధికారం బోర్డులకు లేదన్నారు. డీపీఆర్‌ల ఆమోదంపై రెండో ఎపెక్స్ కౌన్సిల్‌లో కేంద్రమంత్రి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కాలయాపన చేయకుండా డీపీఆర్‌లు సీడబ్ల్యూసీకి పంపాలని తెలంగాణ ప్రభుత్వం లేఖలో డిమాండ్ చేసింది.
ఇదీ చదవండి : KRMB-GRMB: గెజిట్ అమలుకు చర్యలు తీసుకోండి.. తెలుగు రాష్ట్రాలకు లేఖలు