ఏపీ ప్రభుత్వం తమను రిలీవ్ చేయడంపై.. వెలగపూడి సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ఏపీలోని తెలంగాణ ఉద్యోగులు సీఎం జగన్ ఫొటోకు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. సచివాలయం వెలుపల టపాసులు కాల్చి సంబరాలు జరిపారు.
తమకు సహకరించిన ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు జారీ చేయడంపై తెలంగాణ ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: