ఇదీ చదవండి:
KRMB: 'ఏపీపై తెలంగాణ ఫిర్యాదు.. ఆర్డీఎస్ పనులు ఆపేలా ఆదేశాలివ్వండి' - enc letter to krmb
KRMB: ఆర్డీఎస్ కుడికాల్వ పనులపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. కేఆర్‌ఎంబీ ఆదేశాలకు విరుద్ధంగా ఆర్డీఎస్ కుడికాల్వ పనులు కొనసాగిస్తున్నారని తెలిపింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాశారు. ఆర్డీఎస్ కుడికాల్వ పనులు కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బోర్డు అనుమతి లేకున్నా ఏపీ పనులు కొనసాగిస్తోందని కేఆర్ఎంబీకి లేఖలో వివరించారు. బోర్డు ఆదేశాలకు విరుద్ధంగా పనులు కొనసాగిస్తున్నారని తెలిపారు. పనులు ఆపేలా ఏపీని నిలువరించాలని కేఆర్ఎంబీని లేఖలో కోరింది.
![KRMB: 'ఏపీపై తెలంగాణ ఫిర్యాదు.. ఆర్డీఎస్ పనులు ఆపేలా ఆదేశాలివ్వండి' 1](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15804273-123-15804273-1657625583112.jpg?imwidth=3840)
1
ఇదీ చదవండి: