ETV Bharat / city

చిరిగిన గోనె సంచులు అంటగట్టిన గుత్తేదారులు.. - Civil Supplies department receives shabby Jute bags from contractors

కొవిడ్​ సమయంలో అధికారుల పర్యవేక్షణ లేని సమయాన్ని కొందరు గుత్తేదారులు తమకు అనువుగా ఉపయోగించుకున్నారు. తెలంగాణలో పాత గోనె సంచులను పౌరసరఫరాల సంస్థకు అంటగట్టారు. దీనిపై సంస్థ ఛైర్మన్​ విజిలెన్స్​ విచారణకు ఆదేశించగా... విచారణ పూర్తి కాకుండానే చెల్లింపులు జరిగిపోయాయి. హడావుడిగా జరిగిన చెల్లింపులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Telangana
Telangana
author img

By

Published : Nov 6, 2020, 11:22 PM IST

కరోనా కాలం..అధికారుల పర్యవేక్షణ అంతంతమాత్రంగా ఉన్న సమయం. ఈ అవకాశాన్ని కొందరు గుత్తేదారులు ఉపయోగించుకున్నారు. తెలంగాణలో చిరిగిన గోనె సంచులను పౌర సరఫరాల సంస్థకు సరఫరా చేశారు. ఫిర్యాదులు వెల్లువెత్తడం వల్ల సంస్థ ఛైర్మన్‌ ఈ వ్యవహారంపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు. ఆ నివేదిక రాక మునుపే గుత్తేదారులకు సంస్థ తాజాగా చెల్లింపులు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి సీజనులో ధాన్యం కొనుగోళ్లకు 46 శాతం వరకు పాత గోతాలను వినియోగించాలి. అందుకు అనుగుణంగా గడిచిన యాసంగి కాలంలో ధాన్యం సేకరణ కోసం సుమారు ఎనిమిది కోట్ల వరకు ఒకసారి వాడిన గోతాలను తెలంగాణ పౌర సరఫరాల సంస్థ కొనుగోలు చేసింది. ఒక్కోదానికి రూ.24 చొప్పున చెల్లించేలా గుత్తేదారులతో ఒప్పందం కుదుర్చుకుంది. సరఫరా అయిన వాటిలో చిల్లులు పడినవే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు అప్పట్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వాటిల్లో నింపిన ధాన్యం చేరవేయడంలో అనేక ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఆయా జిల్లాల రైస్‌ మిల్లర్లు అప్పట్లో కలెక్టర్లకు ఫిర్యాదులు చేశారు. ‘ఆ సంచులనే ప్రస్తుత వానాకాలం సీజనులోనూ వినియోగించాల్సి ఉంటుంది. వాటితో రబీలో ఇబ్బందులు పడ్డాం. మళ్లీ వాటిని వాడటం సాధ్యం కాదంటూ’ మిల్లర్లు ఉన్నతాధికారుల దృష్టికీ తీసుకువచ్చారు.

వెల్లువెత్తిన విమర్శలు

ఫిర్యాదులు రావటంతో తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ గుత్తేదారులకు చెల్లింపులు చేయవద్దని అప్పట్లో ఆదేశించారు. సంస్థ ఛైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు. అప్పటికే సుమారు 60 శాతం సొమ్ము చెల్లించి ఉండటంతో మిగిలిన మొత్తాన్ని నిలుపుదల చేశారు. ప్రస్తుత వానాకాలం సీజనులో మరో తొమ్మిది కోట్ల వరకు వాడిన గోనె సంచులు కొనుగోలు చేయాల్సి ఉంది. అందుకోసం సంస్థ టెండర్లు ఆహ్వానించగా, టెండర్లు వేసేందుకు గుత్తేదారులెవరూ ముందుకు రాలేదు. పైగా పాత బకాయిలు చెల్లించాలంటూ పట్టుబట్టారు.

ఫిర్యాదులు ఉన్న నేపథ్యంలో బకాయిలలో ప్రస్తుతం 20 శాతం చెల్లించి, విజిలెన్స్‌ విచారణ తర్వాత మిగిలిన 20 శాతం చెల్లించేందుకు అధికారులు నిర్ణయించారు. పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ కూడా దానికి అంగీకారం తెలిపారు. అందుకు భిన్నంగా విజిలెన్స్‌ నివేదిక రాకుండానే నిలుపుదల చేసిన 20 శాతం మొత్తాన్ని (దాదాపు 30-40 కోట్లు) బుధవారం హడావుడిగా చెల్లించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ఏ ప్రాతిపదికన చెల్లింపులు చేశారు? అనేది అంతుచిక్కడం లేదని ఆ సంస్థ ఉద్యోగులే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి:

పక్షులొస్తే.. 'సోలార్​ అలారం' కుయ్​ కుయ్​ మంటోంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.