ETV Bharat / city

దిల్లీకి భాజపా సీనియర్​ నేతలు.. సంజయ్​కు భద్రత పెంపు - దిల్లీకి భాజపా నేతలు

భాజపా అధిష్ఠానం పిలుపు మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ సహా పలువురు సీనియర్​ నేతలు దిల్లీ వెళ్లారు. వచ్చే నెలలో హైదరాబాద్​లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో దానిపై చర్చించేందుకు దిల్లీ రావాలని ఆదేశించినట్లు సమాచారం.

Telangana BJP leaders
సంజయ్​కు భద్రత పెంపు
author img

By

Published : Jun 22, 2022, 12:39 PM IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ మంగళవారం రాత్రి దిల్లీకి బయలుదేరి వెళ్లారు. వచ్చే నెల 2,3 తేదీల్లో హైదరాబాద్​లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దానిపై చర్చించేందుకు బుధవారం అందుబాటులో ఉండాలంటూ భాజపా అధిష్ఠానం ఇచ్చిన సమాచారం మేరకు ఆయన దిల్లీ వెళ్లినట్లు తెలిసింది. కార్యవర్గ సమావేశాల స్టీరింగ్​ కమిటీలో ఉన్న రాష్ట్రానికి చెందిన సీనియర్​ నేతలు కూడా ఆయన వెంట వెళ్లారు. వారంతా పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్​ సంతోష్​ సహా ముఖ్య నేతలను కలిసే అవకాశం ఉంది.

సంజయ్​కు అదనపు భద్రత.. బండి సంజయ్​కు పోలీసులు భద్రత పెంచారు. ప్రస్తుతమున్న దానికి అదనంగా(1+5) ఆరుగురితో కూడిన రోప్​ పార్టీని కేటాయించారు. మరో ఎస్కార్టు వాహనం ఏర్పాటు చేశారు. పర్యటనల సమయంలో ఆయనకు ఈ మేరకు అదనపు సిబ్బంది భద్రత కల్పిస్తారు. అగ్నిపథ్​ పథకంపై ఆందోళనలతో పాటు ఇటీవల కరీంనగర్​లో సంజయ్​ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచాలని నిఘా వర్గాలు సూచించిన మీదట అదనపు భద్రత కల్పించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.