ETV Bharat / city

Telangana: ఇంటికొచ్చాడని సర్పంచ్​ భర్తపై దాడి - జగిత్యాల జిల్లా వార్తలు

ఓ మహిళ ఇంటికి వెళ్లిన సర్పంచ్​ భర్తకు.. గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. అయితే తానే అతన్ని రమ్మన్నానని.. అనుమానంతోనే తన భర్త.. అతనిపై దాడిచేయించాడంటూ.. సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో జరిగింది.

attack-on-sarpanch-husband
సర్పంచ్​ భర్తపై దాడి
author img

By

Published : Jun 28, 2021, 7:54 PM IST

అనుమానంతో సర్పంచ్​ భర్తపై దాడి

తెలంగాణ జగిత్యాల జిల్లా ధర్మపురి కోరండ్లపల్లెలో ఉద్రిక్తత నెలకొంది. ఓ మహిళ ఇంటికెళ్లిన మహిళా సర్పంచ్​ భర్తకు.. గ్రామస్థులు, ఆమె కుటుంబ సభ్యులు.. దేహశుద్ధి చేశారు. ఈ వీడియోను కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేయడంతో వైరల్​గా మారింది.

ధర్మపురి మండలం రాజారం సర్పంచ్​ భర్త అశోక్​.. కోరండ్లపల్లెలోని ఓ మహిళ ఇంట్లోకి వెళ్లారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఆమె భర్త.. స్థానికులతో కలిసి రాజారం సర్పంచ్​ భర్త అశోక్​పై దాడిచేశారు. అతను మాట్లాడేందుకు యత్నించినా.. వినకుండా చితకబాదారు.

ట్విస్ట్ ఏంటంటే..

రైతుబంధు డబ్బుల విషయంలో మాట్లాడేందుకు తానే ఇంటికి పిలిచానని.. సదరు మహిళ వివరించింది. తనపై అనుమానంతోనే దాడికి పాల్పడ్డారంటూ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఘటన వెనుక ఇతర కారణాలు ఉండొచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది.

సదరు మహిళా సర్పంచ్​.. పుట్టింటికి వెళ్లింది. ప్రస్తుతం ఉపసర్పంచ్​కు బాధ్యతలు అప్పగించారు. దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు.

ఇదీచూడండి: IAF:నివురుగప్పిన ముప్పు ముంగిట్లో భారత్‌!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.