ETV Bharat / city

ఎక్కువ సీసీ కెమెరాలున్ననగరాల్లో హైదరాబాద్​కు 16వ స్థానం - ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్​కు మరో గుర్తింపు

నేరాల నియంత్రణలో కీలకంగా వ్యవహరిస్తున్న సీసీటీవి కెమెరాల బిగింపులో తెలంగాణ రాష్ట్ర రాజధానికి మరోసారి గుర్తింపు దక్కింది. ప్రపంచంలోనే ఎక్కువ సీసీటీవి కెమెరాల ఏర్పాటు చేసిన నగరాల్లో హైదరాబాద్కు 16వ స్థానం దక్కింది. లండన్ కేంద్రంగా వీపీఎన్, యాంటీవైరస్, యాప్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానంపై పనిచేస్తున్న కంపారిటెక్ అనే సంస్థ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

Telangana: Another global recognition for Hyderabad- Ranked 16th among cities with the most CC cameras
తెలంగాణ: హైదరాబాద్ కు మరో ప్రపంచ గుర్తింపు- ఎక్కువ సీసీ కెమెరాలున్ననగరాల్లో 16వ స్థానం
author img

By

Published : Jul 24, 2020, 4:35 PM IST

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అత్యధిక సీసీటీవి కెమెరాలు అమర్చిన నేపథ్యంలో ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు లభించింది. లండన్‌ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన 150 నగరాల్లో చేపట్టిన సర్వేలో ఇది వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా ముందు వరుసలోని 20 నగరాల జాబితాలో భారత్‌ నుంచి ఒక్క హైదరాబాద్‌కే స్థానం దక్కింది. 50 నగరాల జాబితాలో మాత్రం చెన్నై, దిల్లీకి చోటు లభించింది.

ప్రతి వెయ్యిమందిలో..

హైదరాబాద్​లో ప్రతి వెయ్యి మందికి 30 కెమెరాలు ఏర్పాటు చేయడం విశేషం. కంపారిటెక్‌ సంస్థ అధ్యయనంలో జనాభాతో కెమెరాలను బేరీజు వేశారు. ప్రతి వెయ్యి మందికి ఎన్ని ఉన్నాయనే అంశం పరిశీలించారు. చైనాలోని తాయువాన్‌ నగరానికి తొలిస్థానం దక్కింది. షాంగ్జి ప్రావిన్స్‌ రాజధాని అయిన ఈ నగరంలో 4.65 లక్షలు ఉన్నట్లు తేలింది. అక్కడ 38.91 లక్షల జనాభాకు ఇన్ని కెమెరాలున్నాయి. ప్రతి వెయ్యి మందికి 119.57 కెమెరాలున్నట్టు తేలింది.

ఎన్ని ఉన్నాయంటే...

హైదరాబాద్‌లో సుమారు 3 లక్షల సీసీ కెమెరాలున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. జంట నగరాల్లో కోటికి పైగా జనాభా ఉన్నట్లు తేల్చగా... ప్రతి వెయ్యి మందికి 30 కెమెరాలు ఉన్నట్లు గుర్తించారు. మొదటి 50 నగరాల్లో 21వ స్థానంలో ఉన్న చెన్నైలో 1.09 కోట్ల జనాభాకుగాను 2.8 లక్షల కెమెరాలున్నట్టు వెల్లడైంది. అక్కడ ప్రతి వెయ్యి మందికి 25.52 కెమెరాలున్నట్టు గుర్తించారు. 33వ స్థానంలో ఉన్న దేశ రాజధాని దిల్లీలో 3.02 కోట్ల జనాభాకుగాను 14.18 సగటుతో 4.29 లక్షల కెమెరాలున్నట్టు తేలింది.

మెట్రో నగరాలు..

భారత్‌లో మిగిలిన మెట్రో నగరాలను పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా కలిగిన మెట్రో నగరాల జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్న ముంబాయిలో 2.04 కోట్ల జనాభాకు కేవలం 9,800 . అంటే 0.48 సగటు. 15వ స్థానంలో ఉన్న కోల్‌కతాలో 1.48 కోట్ల జనాభాకు 13,800 అంటే 0.93 సగటు ఉన్నట్టు తేలింది. ఈ అధ్యయనంలో తొలి 20 నగరాల్లో 18 చైనాలోనే ఉండడం విశేషం. చైనాకు అవతల లండన్‌, హైదరాబాద్‌ మాత్రమే మిగిలిన రెండు స్థానాల్లో ఉన్నాయి. లండన్‌ మూడో స్థానంలో ఉండగా, హైదరాబాద్‌ 16వ స్థానంలో ఉంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 70 కోట్ల కెమెరాలున్నట్లు అంచనా. ఒక్క చైనాలోనే 54 శాతం మేర ఉన్నట్లు తేలింది. 2021 చివరికల్లా ఈ సంఖ్య ప్రపంచంలో 100 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి: గవర్నర్​ ఆదేశాలిచ్చినా పోస్టింగ్ ఇవ్వకపోవటం దారుణం:సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.