తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివారులో ఉదయాన్నే ప్రమాదం చోటుచేసుకుంది. రాయదుర్గం బయోడైవర్సిటీ పార్కు వద్ద ఓ ఇంటి పైకప్పు కూలింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఇంటికి కాంక్రీట్ వేస్తుండగా అకస్మాత్తుగా ఇంటిపైకప్పు కూలింది.
సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రమాదం జరిగినట్లు సమాచారం. అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఆ ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అని జీహెచ్ఎంసీ అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి: భ, జ, న.. వైకాపా భక్తి : గోరంట్ల