ETV Bharat / city

ఫేస్‌ క్యాప్చరింగ్‌ అటెండెన్స్‌ విధానం, అగ్గిమీద గుగ్గిలం అవుతున్న ఉపాధ్యాయులు - ap news updates

FACE CAPTURING SYSTEM ఫేస్‌ క్యాప్చరింగ్‌ అటెండెన్స్‌ విధానం ప్రభుత్వ ఉపాధ్యాయుల సహనాన్ని పరీక్షించింది. తరగతి గదుల్లో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు అటెండెన్స్‌ అప్‌లోడ్‌ చేయడానికి పాఠశాల ఆవరణలో పాట్లు పడ్డారు. ఎంత ప్రయత్నించినా ప్రయత్నం ఫలించక చాలా మంది మిన్నకుండిపోయారు. పిల్లలకు పాఠాలు చెప్పాలా ఇలాంటి యాప్స్‌తో కుస్తీ పట్టాలా అంటూ గురువులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.

FACE CAPTURING SYSTEM
FACE CAPTURING SYSTEM
author img

By

Published : Aug 16, 2022, 9:59 PM IST

FACE CAPTURING: కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయుల హాజరు కష్టాలు వర్ణణాతీతం.. ఫేస్‌ రికగ్నైజేషన్‌ యాప్ డౌన్‌లోడ్‌ చేసుకుని.. 9గంటల్లోపు ఫోటోలు అప్‌లోడ్‌ చేస్తేనే హాజరు పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధానం అమల్లోకి తెచ్చిన తొలిరోజు ఇదిగో ఇలా ఉపాధ్యాయులు అష్టకష్టాలు పడ్డారు. ఈ పాఠశాలలో.. మొత్తం 24 మంది ఉపాధ్యాయులు, ఆరుగురు బోధనేతర సిబ్బంది ఉన్నారు. ఉదయం 9 గంటలలోపు.. కేవలం ఇద్దరికే హాజరు ప్రక్రియ పూర్తైంది. మిగతా వారంతా ఇదిగో ఇలా పాఠశాల ఆవరణలో.. అగచాట్లు పడ్డారు. పట్టువదలని విక్రమార్కుల్లా.. ఆ యాప్‌తో కుస్తీపట్టారు. చివరకు నిస్సహాయంగా క్లాసుల్లోకి వెళ్లిపోయారు.

ఇక ఇద్దరు టీచర్ల మధ్య జరిగిన సంభాషణ ఆసక్తి రేపుతోంది. ఎంతసేపటికీ యాప్‌లో హాజరు నమోదుకాకపోవడంతో సెటైర్లు వేసుకున్నారు. రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఫేస్‌ రికగ్నైజేషన్‌ యాప్‌తో విసిగిపోయారు. చాలామందికి కనీసం అవగాహనే లేదు. సీఎం సొంత జిల్లా.. పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో.. మొత్తం 38 మంది ఉపాధ్యాయులు ఉండగా మధ్యాహ్నం 12 గంటల వరకూ కేవలం పదిమంది హాజరు మాత్రమే అప్‌లోడ్ అయింది. మిగతా వారికి నాట్‌ సక్సెస్‌ అని వచ్చింది.

ఫేస్ క్యాప్చరింగ్ అటెండెన్స్ విధానం రద్దు చేయాలని.. ఏపీటీఎఫ్, ఫ్యాప్టో ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. విజయవాడ ధర్నాచౌక్‌లో.. 30 రోజుల నిరసన దీక్షలు ప్రారంభించాయి. విద్యావ్యవస్థను గందరగోళం చేయకుండా.. సీపీఎస్‌ రద్దు సహా ఇతర డిమాండ్లను నెరవేర్చాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేశాయి.

ఫేస్‌ క్యాప్చరింగ్‌ అటెండెన్స్‌ విధానం, అగ్గిమీద గుగ్గిలం అవుతున్న ఉపాధ్యాయులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.