తెలంగాణలో గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులు, సిబ్బందికి రేపట్నుంచి రెండు వేల రూపాయల ఆర్థికసాయం అందనుంది. నిన్నటి వరకు జిల్లా విద్యాశాఖాధికారుల ధ్రువీకరణ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 1,06,383 మంది ఉపాధ్యాయులు, 11,621 మంది సిబ్బంది వారి వివరాలు అందజేశారు. మొత్తంగా 1,18,004 మంది లబ్ధి పొందనున్నారు.
ఇదీ చదవండి: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి టీకా
రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఖరారు చేసిన ప్రకారం రేపట్నుంచి నాలుగు రోజుల పాటు నగదు సాయాన్ని అందించనున్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది ఇచ్చిన వివరాల ప్రకారం వారి వారి బ్యాంకు ఖాతాల్లో రెండు వేల రూపాయల నగదును ఆర్థికశాఖ జమచేయనుంది. 21వ తేదీ నుంచి 25వరకు కుటుంబానికి 25 కిలోల చొప్పున సన్నబియ్యాన్ని ఉచితంగా అందించనున్నారు.
ఇదీ చదవండి: