స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన ఎస్ఈసీ రమేశ్‌కుమార్‌పై వైకాపా నేతలు ఆరోపణలు గుప్పించారు. తన పరిధి మరిచి ఎస్ఈసీ వ్యవహరించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. కరోనా పేరు చెప్పి ఎన్నికలు వాయిదా వేసిన రమేశ్‌కుమార్.... రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వంతో ఎందుకు మాట్లాడలేదని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ప్రశ్నించారు. అనుమానాలు వచ్చేలా ఎస్ఈసీ వ్యవహరించారని మంత్రి పేర్ని నాని ఆగ్రహించారు.
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై వైకాపా నేతలు స్పందిస్తున్న తీరును, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రమేశ్ కుమార్‌పై చేసిన ఆరోపణలను.... తెలుగుదేశం నేతలు తప్పుబట్టారు. నామినేషన్లు, విత్ డ్రాలు అయిపోయిన తర్వాత... ఎన్నికల వాయిదాపై విరుచుకుపడటం విడ్డూరంగా ఉందని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల సంఘాన్ని రద్దు చేసే అధికారం సీఎం జగన్‌కు లేదని, ఉంటే ఈ పాటికే ఈసీ ని రద్దు చేసేవారని బుచ్చయ్యచౌదరి ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి: