కాళ్లు మొక్కాల్సిన అమరావతి రైతులతో కన్నీళ్లు పెట్టిస్తున్న ఘనత జగన్ ప్రభుత్వానిదేనని తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు ఆగ్రహించారు. తుళ్లూరులో మహాధర్నా కార్యక్రమానికి తెదేపా మహిళా నేతలు, ఎమ్మెల్సీలు హాజరై.... రైతులు, మహిళల పోరాటానికి సంఘీభావం తెలిపారు. రాజధాని మహిళల పోరాట స్ఫూర్తి చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. త్వరలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేంద్రప్రభుత్వాన్ని కలవనున్నామని చెప్పారు. వెలగపూడిలో రాజధాని రైతులు, మహిళల దీక్షకు ఎమ్మెల్సీ అశోక్ బాబు సంఘీభావం తెలిపారు. మండలిలో ఓటింగ్, డివిజన్ లేకుండా నిర్ణయం తీసుకోకూడదని వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు.
ఇదీ చదవండి: