పెరిగిన ఆర్టీసీ ఛార్జీలకు నిరసనగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సు డిపోల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. నేతలతో సమావేశమైన చంద్రబాబు ఆర్టీసీ ఛార్జీల పెంపును తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ తీరును ఎండగట్టాలని ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. సచివాలయం ఫైర్‌స్టేషన్ వద్ద నేడు చేప్టట్టే నిరసన కార్యక్రమంలో చంద్రబాబు స్వయంగా పాల్గొననున్నారు. ఆయనతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి