తిరుమలపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ తప్పుబట్టింది. మంత్రి వ్యాఖ్యలు భక్తుల మనోభావాలు దెబ్బతీసెలా ఉన్నాయని... ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. జగన్ మెప్పు కోసం తిరుమల సంప్రదాయాలను ఉల్లంఘించేలా కొడాలి వ్యాఖ్యలు ఉన్నాయని ఆక్షేపించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన కొడాలి నానిని... జగన్ ఎందుకు మందలించలేదని నిలదీశారు. శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించే అన్యమతస్తులు... డిక్లరేషన్ ఇవ్వడం నిబంధన అని గుర్తుచేశారు.
అన్యమతస్తులు ఎక్కడివారైనా... డిక్లరేషన్‌పై సంతకం చేయడం తప్పనిసరని వెంకట్రావు పేర్కొన్నారు. జగన్ తాను హిందువునని స్పష్టంగా ప్రకటించలేదన్న కళా... శ్రీవారికి పట్టువస్త్రాలు ఇచ్చేటప్పుడూ ఆయన శ్రీమతిని తీసుకెళ్లలేదని గుర్తుచేశారు. డిక్లరేషన్‌పై జగన్ సంతకం పెట్టాలనేది... భక్తుల మనోవాంఛ అని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు గురించి నాని చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని కళా డిమాండ్ చేశారు.
కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే...
అన్యాయంపై పోరాడలేక చేతులెత్తేయడం... వంశీ చేతకానితనానికి నిదర్శనమని లేఖలో దుయ్యబట్టారు. అయ్యప్ప దీక్షను అగౌరవపరుస్తూ... వల్లభనేని వంశీ ఇతరులను దుర్భాషలాడారని కళా విమర్శించారు. తన ఆర్థిక ప్రయోజనాల కోసం గన్నవరం ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెట్టారని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి : 8 నెలల గర్భిణీ... 15 కిలోల బరువు... 5 కిలోమీటర్ల ప్రయాణం..!