స్టీల్ సిటీగా పేరొందిన విశాఖ.. విజయసాయిరెడ్డి సారథ్యంలో స్టోలెన్ సిటీగా మారిందని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి విమర్శించారు. పోస్కోతో ఒప్పందంపై తనకేమీ తెలియదన్నట్లు.. జగన్ ప్రజల్ని నమ్మించే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైకాపా నేతలకు వాస్తవాలు అర్థమయ్యేలా ప్రజలు సమాధానం చేప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.
జగన్‌లా మనసులో విషం దాచుకొని, పైకి నటించటం చంద్రబాబుకు తెలియదని దివ్యవాణి అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఒక్కో కుటుంబంపై 2.35 లక్షల రూపాయల భారం మోపారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని రౌడీయిజానికి, దోపిడీకి కేంద్రంగా మార్చి.. పంచాయతీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: