రామతీర్థం విగ్రహ ధ్వంసం సాక్ష్యాలను విజయసాయి రెడ్డి చెరిపేశారని తెదేపా అధికార ప్రతినిధి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. శ్రీరాముని విగ్రహ ధ్వంసం ఘటనలో ప్రభుత్వం తీరు అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. చంద్రబాబు రామతీర్ధ పర్యటన చేపట్టగానే విజయసాయి ఆందోళనకు గురయ్యారని అందుకే.... తెదేపా అధినేత కంటే ముందుగా కొండపైకి వెళ్లి సాక్ష్యాలు చెరిపేశారని ఆరోపించారు.
కొండపైకి వెళ్లిన చంద్రబాబును గుడిలోకి అనుమతించకుండా తాళాలు వేశారని మండిపడ్డారు. సీబీఐ విచారణకు తెదేపా డిమాండ్ చేస్తే.. క్రైస్తవుడు అధిపతిగా ఉన్న సీఐడీ విభాగంతో విచారణ జరిపిస్తున్నారని సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: