'రాజధాని అమరావతిని కాపాడుకుందాం' అనే నినాదంతో మరో ఉద్యమ కార్యాచరణకు తెలుగుదేశం సిద్ధమవుతోంది. డిసెంబర్ 5వ తేదీన చంద్రబాబు అధ్యక్షతన ఓ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది. వైకాపా మినహా అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజాసంఘాలు, న్యాయవాదులు, ఎడిటర్లు, మేధావులను ఆహ్వానించనున్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో వచ్చిన అభిప్రాయాలు, సలహాలు ఆధారంగా తదుపరి ఉద్యమ ప్రణాళికను ప్రకటించాలని అధినేత చంద్రబాబు నిర్ణయించారు.
ప్రజల్ని చైతన్య పరిచేందుకు ప్రణాళిక
రౌండ్ టేబుల్ సమావేశ నిర్వహణపై తన నివాసంలో పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు చర్చించారు. రాజధాని అంటూ ఒకటి లేకపోతే మరే నగరం అభివృద్ధి సాధ్యం కాదనేది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి చైతన్యపరచాలని నేతలకు సూచించారు. అమరావతిని అభివృద్ధి చేస్తూనే విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి, రాజమండ్రి, నెల్లూరు వంటి నగరాలు అభివృద్ధి జరగాలన్నది తెదేపా విధానమని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :