ETV Bharat / city

అన్న క్యాంటీన్లను తెరుస్తాం: లోకేశ్ - municipal elections news

పురపాలక ఎన్నికల కోసం 10 హామీలతో తెదేపా రూపొందించిన మేనిఫెస్టోను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శుక్రవారం విడుదల చేశారు. పురపాలికల్లో తాము అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లను తెరుస్తామని తెదేపా ప్రకటించింది.

nara lokesh
నారా లోకేశ్‌
author img

By

Published : Feb 27, 2021, 5:12 AM IST

పురపాలికల్లో తాము అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లను తెరుస్తామని తెదేపా ప్రకటించింది. పురపాలక ఎన్నికల కోసం 10 హామీలతో తెదేపా రూపొందించిన మేనిఫెస్టోను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ శుక్రవారం విడుదల చేశారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాలనపై లోకేశ్‌ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్‌ ముమ్మాటికీ పిరికివారేనని.. అందుకే ప్రత్యేక హోదాను, ఇప్పుడు విశాఖ ఉక్కును వదిలేశారని ఆరోపించారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం ఒక కమిటీ ద్వారా జరిగిందని, దానిలో వైకాపా ఎంపీ అవినాశ్‌రెడ్డి కూడా సభ్యుడని తెలిపారు. ‘కమిటీ ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు అవినాశ్‌రెడ్డి వ్యతిరేకించలేదు. ఇక ఆ పార్టీకి 22 మంది ఎంపీలు ఉండి ఏం సాధిస్తారు? స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణే ఆపలేనివారు.. ప్రత్యేక హోదా ఎప్పుడు తెస్తారు?’ అని ఆయన మండిపడ్డారు. పట్టణ ప్రాంతాల్లో 3నెలలపాటు 10వేల మందిని సర్వే చేసి మేనిఫెస్టో రూపొందించామని అన్నారు. స్థానిక సంస్థలకు నిధులివ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం అయినప్పుడు.. గెలిస్తే అది చేస్తాం, ఇది చేస్తామంటూ ప్రతిపక్ష పార్టీ ఎలా మేనిఫెస్టో విడుదల చేస్తుందని మంత్రి పెద్దిరెడ్డి అంటున్నారు కదా? అన్న ప్రశ్నకు... ‘కేంద్రం నుంచి కొన్ని నిధులు నేరుగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు వస్తాయి. ఆర్థిక సంఘం నిధులూ నేరుగా పంచాయతీ ఖాతాలకు వస్తాయి. పంచాయతీరాజ్‌శాఖ మంత్రికి కనీస అవగాహన లేదు’ అని లోకేశ్‌ ధ్వజమెత్తారు.

పెద్దిరెడ్డి కాదు కదా... ఎవరూ ఏమీ చేయలేరు
'శాంతియుతంగా ఉండే కుప్పం నియోజకవర్గంలోకి పుంగనూరు, కర్ణాటకల నుంచి మనుషులను తీసుకొచ్చి మా పార్టీ శ్రేణులను బెదిరించి దొంగ కేసులు పెట్టి పంచాయతీల్ని గెలుచుకున్నారు. రాష్ట్రమంతా అదే పరిస్థితి. 2019 ఎన్నికల్లో చంద్రబాబు అక్కడ 30 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. పెద్దిరెడ్డి కాదు కదా ఆయన బాబు వచ్చినా అక్కడ తెదేపాను ఏమీ చేయలేరు' అని లోకేశ్‌ అన్నారు.

సజ్జల ఓ సలహాదారు మాత్రమే
'సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజల సొమ్ము నుంచి జీతం తీసుకునేవారు. ఆయనెవరు నా గురించి మాట్లాడటానికి?' అని లోకేశ్‌ మండిపడ్డారు. పోలీసుల సహకారంతో అధికార పార్టీ కేసులు పెట్టి, దౌర్జన్యాలకు పాల్పడి చాలా చోట్ల ఓట్ల లెక్కింపులో ఫలితాలు తారుమారు చేసినా కూడా తెదేపా 38.89 శాతం పంచాయతీల్ని చేజిక్కించుకుందని వివరించారు.

ఇదీ తెదేపా మేనిఫెస్టో
1. అన్న క్యాంటీన్లను మళ్లీ తెరిచి రూ.5కే పేదలకు కడుపు నిండా భోజనం పెడతాం.
2. పాత ఆస్తిపన్ను బకాయిలను రద్దు చేస్తాం. ప్రస్తుతం కడుతున్న పన్నును సగానికి తగ్గిస్తాం. ప్రస్తుత శ్లాబ్‌లో 50 శాతమే పన్నుగా విధిస్తాం.
3. శుభ్రమైన ఊరు- శుద్ధమైన నీరు. నగరాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుతాం. కుళాయి ద్వారా స్వచ్ఛమైన తాగునీరందిస్తాం. కాలువల్లో చెత్త పేరుకోకుండా మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటుచేస్తాం.
4. నిరుద్యోగ యువత కోసం 6నెలలకోసారి ఉద్యోగ మేళా.
5. సుందరీకరణ మిషన్‌- చెత్తలేని నగరం: ప్రతి రోజూ ఇంటింటినుంచీ చెత్త సేకరణ. ప్రజా, వాణిజ్య, నివాస ప్రాంతాల్లో చెత్త నిర్మూలన. ప్రతి 500 మీటర్లకు చెత్తకుండీలు. భూగర్భ నీటిపారుదల వ్యవస్థ. గుంతలులేని రోడ్లు. పార్కుల్లో ఓపెన్‌జిమ్‌లు. పిల్లలకు ఆటస్థలాలు. ఎల్‌ఈడీ వీధి దీపాలు.
6. ఆటోడ్రైవర్ల కోసం తాగునీరు, మరుగుదొడ్డి సదుపాయాలతో ఉచిత, శాశ్వత ఆటోస్టాండ్లు.
7. స్వయం సహాయ సంఘాల కోసం ప్రత్యేక వసతులు. స్లమ్‌, పట్టణ సమాఖ్యలకు సమావేశ మందిరాలు. ప్రతి పట్టణంలో మెప్మాబజార్లు. బ్యాంకుల అనుసంధానంతో వడ్డీలేని రుణ సదుపాయం.
8. పట్టణ పేదలకు గృహనిర్మాణం. పేదలందరికీ టిడ్కో ఇళ్లు.
9. పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.21 వేలకు పెంపు.
10. ఉచిత మంచినీటి కనెక్షన్‌. ఎలాంటి పన్నులేకుండా అందరికీ ప్రాథమిక హక్కుగా సురక్షిత తాగునీరు.

ఇదీ చదవండి: హోదా తెమ్మంటే.. ఉక్కుకూ ఎసరు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.