ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా నిలిచే మీడియా ప్రతినిధులు కరోనా బారిన పడటం ఆందోళన కలిగించే అంశమని తెదేపా అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న పాత్రికేయులు, వారి కుటుంబ సభ్యులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యునిసెఫ్ మార్గదర్శకాలు పాటించాలని చంద్రబాబు కోరారు. విధులు నిర్వర్తించిన అనంతరం చేతులు శుభ్రంగా కడుక్కోవడం సహా మొబైల్ ఫోన్లను శానిటైజ్ చేయాలని అన్నారు.
ట్విటర్ ద్వారా 8 సూత్రాలు
విలేకరులు న్యూస్ సేకరించే క్రమంలో జాగ్రత్తలు పాటించాలని.. చంద్రబాబు సూచించారు. దీనికి సంబంధించి 8 సూత్రాలను ట్విటర్ ద్వారా వివరించారు. చిత్రీకరణ సమయంలో ఆరడుగుల దూరం ఉండేలా చూడాలని.. పౌష్టికాహారం తీసుకోవాలని అన్నారు.
ఇదీ చూడండి: