రాజధానిగా అమరావతిని కొనసాగించే అంశంపై ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు అసెంబ్లీని రద్దు చేయాలని అధికార పార్టీకి 48 గంటల సమయం ఇచ్చిన తెదేపా అధినేత చంద్రబాబు ఈ సాయంత్రం మళ్లీ మీడియా ముందుకు రానున్నారు. మూడు రాజధానులని ఎన్నికల ముందు చెప్పకపోవడం నమ్మకద్రోహమేనని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని గతంలో జగన్, వైకాపా నేతలు చెప్పిన వీడియోలను తెదేపా నేతలు వైరల్ చేశారు.
ఏం చెప్పనున్నారు..?
రాజధానిగా అమరావతిని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది.. వైకాపా నేతలు ఎన్నికల ముందు ఏం చెప్పారు.. ఇప్పుడు ఏం చేస్తున్నారు.. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి తప్ప.. పరిపాలన వికేంద్రీకరణ కాదనే విషయాన్ని చంద్రబాబు నివేదికల రూపంలో బయటపెట్టవచ్చని తెలుస్తోంది. తెదేపా హయాంలో జిల్లాల వారీగా చేపట్టిన అభివృద్ధి ప్రణాళికలను వివరించనున్నారు. అమరావతి కోసం కేంద్రం ఇచ్చిన నిధులు.. తమ ప్రభుత్వ హయాంలో ఎంత ఖర్చు చేసింది వంటి అంశాలపై ప్రజల్ని చైతన్యపరుస్తూ.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి..