పిఠాపురం మున్సిపల్ కమిషనర్ ఎం.రామ్మోహన్‌ను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని కోరుతూ ఎస్ఈసీకి తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. గతంలో ఎన్నికల విధులు నిర్వహిస్తుండగా మున్సిపల్ కమిషనర్ పలు అవకతవకలకు పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. పిఠాపురం మున్సిపాలిటీ ఓటరు లిస్టు తయారీలో తప్పులు చేసి సస్పెండ్ అయ్యారని వివరించారు. ఎన్నికలు సజావుగా సాగాలంటే రామ్మోహన్‌ను విధుల నుంచి తొలగించాలన్నారు.
ఇదీ చదవండి: పంచాయతీ పోరు: ఉదయం 8.30 గంటలకు పోలింగ్ శాతం ఇలా