ETV Bharat / city

మంత్రి పెద్దిరెడ్డి చెప్పినవన్నీ అవాస్తవాలే: పట్టాభిరామ్

author img

By

Published : Apr 29, 2021, 3:50 PM IST

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి విమర్శలు గుప్పించారు. పెద్దిరెడ్డికి చెందిన వందలాది లారీలు పొరుగు రాష్ట్రాలకు ఇసుకను అక్రమంగా తరలిస్తుంటే, తాడేపల్లి ఖజానాకు ప్రతినెలా వాటాలు వెళ్తున్నాయని ఆరోపించారు. ఇసుక కాంట్రాక్టు సాంకేతిక బిడ్ విషయంలో మంత్రి పెద్దిరెడ్డి అసత్యాలు చెప్పారని ఆధారాలను మీడియా ముందు ప్రదర్శించారు.

పట్టాభిరామ్
పట్టాభిరామ్
పట్టాభిరామ్

రాష్ట్రంలో ఇసుక కాంట్రాక్టు సాంకేతిక బిడ్​కు సంబంధించిన నిబంధనలు కేంద్ర ప్రభుత్వ సంస్థ మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎస్టీసీ) రూపొందించిందని మంత్రి పెద్దిరెడ్డి చెప్పిందంతా అవాస్తవమని.. తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. నిబంధనలు తాము రూపొందించలేదని, ఎంఎస్టీసీ సమాచార హక్కు చట్టం ద్వారా ఇచ్చిన సమాధానం వివరాలను ఆధారాలుగా బయటపెట్టారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలోఎంఎస్టీసీ ద్వారానే ఇసుక కాంట్రాక్టును జేపీ పవర్ వెంచర్స్​కు కట్టబెట్టామని చెప్పిన వివరాలను మీడియా సమావేశంలో ప్రదర్శించారు పట్టాభి.

జయప్రకాష్ పవర్ వెంచర్స్​కు అనుకూలంగా నిబంధనలు తయారుచేసి, బూటకపు టెండర్ ద్వారా ఇసుక మొత్తం నష్టాల్లో ఉన్న ఆ సంస్థకు కట్టబెట్టారు. పారదర్శకంగా ఎంఎస్టీసీనే నిర్వహించిందని పెద్దిరెడ్డి బుకాయిస్తూ వచ్చారు. సాంకేతిక బిడ్ నిబంధనలు ఎవరు రూపొందించారని స.హ.చట్టం ద్వారా ఎంఎస్టీసిని ప్రశ్నిస్తే తాము రూపొందించలేదని స్పష్టం చేస్తూ సమాధానం ఇచ్చింది. కాంట్రాక్ట్ విషయంలో తమ పాత్ర సర్వీసు ప్రొవైడర్ మాత్రమేనని ఎంఎస్టీసీ వెల్లడించింది. ప్రభుత్వ పెద్దలు వేలకోట్ల రూపాయలు దండుకోవడానికే డమ్మీ కంపెనీని అడ్డం పెట్టుకుని ఇసుక కాంట్రాక్టు కట్టబెట్టారని బట్టబయలైంది. పెద్దిరెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ని అరెస్టు చేసే దమ్ము సీఐడీ, ఏసీబీ అధికారులకు ఉందా. దేవినేని ఉమ, ధూళిపాళ్ల నరేంద్ర పట్ల వ్యవహరించిన రీతిలోతనే ఏసీబీ, సీఐడీలు మంత్రి పట్ల వ్యవహరించాలి. పెద్దిరెడ్డికి చెందిన వందలాది లారీలు పొరుగు రాష్ట్రాలకు ఇసుకను అక్రమంగా తరలిస్తుంటే, తాడేపల్లి ఖజానాకు ప్రతినెలా వాటాలు వెళ్తున్నాయి.-పట్టాభిరామ్, తెదేపా అధికార ప్రతినిధి

ఇదీ చదవండీ... ధూళిపాళ్ల నరేంద్ర పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.