ETV Bharat / city

కేసీఆర్​కు చంద్రబాబు, లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు - సీఎం కేసీర్ పుట్టినరోజు

తెలంగాణ సీఎం కేసీఆర్​ జన్మదినం సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

tdp-president-chandra-babu-wish-to-cm-kcr-over-his-birthday-occasion

author img

By

Published : Feb 17, 2020, 12:17 PM IST

tdp-national- president-chandra-babu-wish-to-cm-kcr-over-his-birthday-occasion
చంద్రబాబు ట్వీట్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ 66వ జన్మదినోత్సవం సందర్భంగా.. తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. సంపూర్ణ ఆయురారోగ్యాలు, ఆనందాన్ని ప్రసాదించాలని భగవంతున్ని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. కేసీఆర్​కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎప్పుడు నిండు ఆరోగ్యంగా ఉండాలని ట్వీట్ చేశారు.

కేటీఆర్, హరీశ్ శుభాకాంక్షలు..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ 66వ పుట్టినరోజు సందర్భంగా ఆ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు ట్విటర్​ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తనకు తెలిసిన బహుముఖ ప్రజ్ఞాశాలి, ధైర్యవంతుడు, దయ కలిగిన వ్యక్తి కేసీఆర్​ అని.. అతన్ని తాను తండ్రిగా పిలవడం గర్వకారణమని కేటీఆర్​ పేర్కొన్నారు. తెలంగాణ గడ్డకు కేసీఆరే శ్రీరామ రక్ష అంటూ ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్​రావు ట్వీట్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.