ETV Bharat / city

'కేంద్రం మెడలు వంచుతామన్నారు... ఇప్పుడు మాట్లాడరెందుకు?' - వైకాపా ఎంపీలు

పార్లమెంట్​లో వైకాపా ఎంపీల తీరుపై తెలుగుదేశం పార్టీ ఎంపీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్రం మెడలు వంచుదామన్న జగన్... ఇప్పుడు హోదా కోసం అదే కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. రాష్ట్రం కోసం తాము పార్లమెంట్​లో మాట్లాడుతుంటే వైకాపా ఎంపీలు అడ్డుపడడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

tdp mp's fire on ycp mp's for not questioning central government for specail status

author img

By

Published : Feb 5, 2020, 7:06 PM IST

దీల్లీలో మీడియాతో తెదేపా ఎంపీలు

కేంద్రం నుంచి రూపాయి తెచ్చుకోలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని తెదేపా ఎంపీలు మండిపడ్డారు. హోదా గురించి వైకాపా ఎంపీలు కేంద్రాన్ని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. లేఖలతో ప్రత్యేక హోదా రాదని, రాజీనామాలు చేయాలని గతంలో చెప్పిన జగన్‌.. ఇప్పుడెందుకు ముందుకు రారని తెలుగుదేశం ఎంపీలు నిలదీశారు. రాజధాని మార్పులపై లోక్‌సభలో తాము అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే.. వైకాపా ఎంపీలు అడ్డు తగిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఎలా తెస్తారనే విషయంలో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం మెడలు వంచి హోదా తెస్తామని గతంలో చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రధాని, కేంద్ర మంత్రులని గట్టిగా అడగండని వైకాపా ఎంపీలకు సూచించారు. హోదా గురించి పోరాటం చేస్తే తాము కూడా మద్దతిస్తామని స్పష్టం చేశారు.

రామ్మోహన్ నాయుడు సవాల్

మా మీదే మీ ప్రతాపం చూపించాలని అనుకుంటే మేము రాష్ట్రానికి వస్తాం. అక్కడే పోటాపోటీగా తేల్చుకుందాం. పార్లమెంట్​లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందుకు ప్రశ్నించడం లేదు? ప్రత్యేక హోదా కోసం పోరాడండి- రామ్మోహన్ నాయుడు, తెదేపా ఎంపీ

మనల్ని చూసి తెలంగాణలో నవ్వుతున్నారు

రాష్ట్రాన్ని ముక్కలు చేసి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని వైకాపా సర్కార్​పై తెదేపా ఎంపీలు ధ్వజమెత్తారు. రాష్ట్ర పరిస్థితులు చూసి కేసీఆర్‌, తెలంగాణ మంత్రులు ఆనందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో మంచి నాయకత్వం లేదన్న కారణంగా.. తెలంగాణలో సంబరాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.