ETV Bharat / city

"మాధవ్‌పై చర్యలు తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు"

TDP MP's on MP Gorantla video issue: మహిళలను కించపరిచేలా వ్యవహరించిన వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఇంతవరకు ఎలాంటి చర్యలెందుకు తీసుకోలేదని.. తెలుగుదేశం ఎంపీలు ప్రశ్నించారు. మాధవ్‌పై చర్యలు తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. గోరంట్ల మాధవ్‌పై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని... భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.

mp
రామ్మోహన్‌నాయుడు
author img

By

Published : Aug 9, 2022, 3:04 PM IST

YSRCP MP Gorantla Madhav Viral Video: వైకాపాకు చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ను కాపాడేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. మాధవ్‌ వ్యవహారంలో వైకాపా ఇంతవరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని.. భయపడుతున్నారా? అని నిలదీశారు. ఆయనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు తెదేపా తరఫున ఫిర్యాదు చేశామని.. చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రామ్మోహన్‌నాయుడు మాట్లాడారు.

MP Rammohan naidu: గోరంట్ల మాధవ్‌పై చర్యల విషయంలో వైకాపా నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందనా లేదని రామ్మోహన్‌నాయుడు అన్నారు. వెంటనే బర్తరఫ్‌ చేయిస్తామని.. డిస్మిస్‌ చేస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారని... ఇప్పుడేమో ఆ విషయాన్ని నిర్వీర్యం చేసేందుకు అది ప్రైవేటు వ్యవహారమని మాట్లాడుతున్నారన్నారు. మాధవ్‌పై చర్యలు తీసుకుంటే.. అదే పార్టీలో ఉన్న సగానికి సగం మందిపైనా చర్యలు తీసుకోవాలని భయపడుతున్నారా? అని ప్రశ్నించారు. మాధవ్‌ ఒక్కరే కాదు. వైకాపా నేతల్లో చాలా మందిపై అత్యాచార కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లలో చూశామన్నారు. అలాంటి నేతలను వైకాపా ప్రోత్సహిస్తోందని దుయ్యబట్టారు. మాధవ్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పి.. ఇప్పుడు ఆయన్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇది ముమ్మాటికీ జగన్‌ ఆలోచనేనని అన్నారు. ఆయనకు ఎప్పుడూ రాజకీయమే ముఖ్యం తప్ప.. ప్రజలు, మహిళల ప్రయోజనాలు కాదనే విషయం అర్థమవుతోందని విమర్శించారు. మాధవ్‌పై చర్యలు మొదలు పెడితే వైకాపా సగం ఖాళీ అయిపోతుందని... అది గ్రహించే ఇప్పుడు మాటమార్చి ఆ విషయాన్ని పక్కదోవ పట్టించే పనిలో ఉన్నారని రామ్మోహన్‌నాయుడు అన్నారు.

ఎంపీ గోరంట్ల మాధవ్​ వీడియో వ్యవహారంపై తెదేపా ఎంపీలు

"గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవడానికి భయమా?. ఇంకా ఎన్ని వీడియోలు చూడాలని వైకాపా అనుకుంటోంది. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా చర్యలు ఎందుకు లేవు?. చర్యలు తీసుకోకపోతే ప్రోత్సహిస్తున్నారని అనుకోవాలా?. ఒకవేళ ఆయనపై చర్యలు తీసుకుంటే వైకాపా ఖాళీ అవుతుందనా?. గోరంట్ల మాధవ్‌పై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశాం. అవసరమైతే ప్రివిలైజ్‌ కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరాం. ఎంపీలపై ప్రజలకు నమ్మకం పోయేలోపే చర్యలు తీసుకోవాలి. మహిళల సంరక్షణ.... వైకాపా ప్రభుత్వానికి పట్టదు."-ఎంపీ రామ్మోహన్‌

ఆ వీడియోపై మాట్లాడాలంటే మాకే సిగ్గుగా ఉంది.. కానీ..: ఒక ఎంపీ వీడియో అలా వస్తే మాకూ సిగ్గుచేటని రామ్మోహన్‌నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఈ వ్యవహారంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఓ వైపు ఆ వీడియోపై మాట్లాడాలంటే మాకే సిగ్గుగా ఉందని.. కానీ మహిళల రక్షణ, పార్లమెంట్‌ గౌరవం కాపాడాల్సిన బాధ్యత సాటి ఎంపీలుగా తమపై ఉందని తెలిపారు. ఇలాంటి వీడియోలు బయటకు వచ్చినప్పుడు ప్రజలకు పార్లమెంట్‌పై ఉన్న నమ్మకం దిగజారిపోతుందని పేర్కొన్నారు. అందుకే స్పీకర్‌కు ప్రత్యేకంగా ఓ లేఖ అందజేసి.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఎంపీపై చర్యలు తీసుకోవాలని కోరామని స్పష్టం చేశారు.

ఎంపీ మాధవ్‌ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్లున్న వీడియో ఇటీవల వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగింది. పలుచోట్ల తెదేపా నేతలు ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.