'18 నెలల్లో సీఎం జగన్ ఎన్నిసార్లు దిల్లీ వెళ్లారు..? విభజన చట్టంలోని సమస్యలపై కేంద్రంతో మాట్లాడారా?.. విశాఖ రైల్వే జోన్ గురించి కేంద్రాన్ని అడిగారా? కర్నూలుకు హైకోర్టు తరలించేందుకు చేసే ప్రక్రియ తెలియదా? ప్రాజెక్టుల అనుమతి కోరినప్పుడు అధికారులను తీసుకెళ్లారా? దిల్లీ పర్యటనలను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు? దిల్లీ పర్యటన.. వ్యక్తిగత లాభం కోసమా.. రాష్ట్ర ప్రయోజనాల కోసమా?' అంటూ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ ప్రశ్నలు గుప్పించారు.
సీఎం జగన్ దిల్లీ పర్యటన అనేక అనుమానాలు కలిగిస్తున్నాయని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి దిల్లీ పర్యటనపై గోప్యత ఎందుకని ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రిని కలిసి పోలవరం నిధుల గురించి అడిగామని చెప్పడం.. అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సమస్యలను ప్రస్తావించాలనుకుంటే.. ఒక్క అధికారిని కూడా ఎందుకు తీసుకెళ్లలేదని కనకమేడల ప్రశ్నించారు.
ఇదీ చదవండి: