శాసనమండలి ఛైర్మన్ ఇచ్చిన ఆదేశాలను కార్యదర్శి పాటించకుండా ప్రభుత్వం ఆయన్ను బెదిరించి భయపెడుతోందని తెలుగుదేశం ఎమ్మెల్సీలు ఆరోపించారు. ఛైర్మన్ ఇచ్చిన ఆదేశాలను సమీక్ష కోసం తిరిగి ఆయనకే పంపటమేంటని ప్రశ్నించారు. ఇది రెండు పార్టీల మధ్య పోరాటం కాదని... చట్టబద్ధంగా వ్యవహరించాలని ప్రభుత్వానికి హితవు పలికారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఈ వ్యవహారాన్ని గవర్నర్, కేంద్ర హోంమంత్రి, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
ఇదీ చదవండి: రాష్ట్ర ప్రజలపై భారం.. విద్యుత్ ఛార్జీలు పెంపు