శాసన మండలిలో తమ సభ్యునిపై దాడి జరిగిందని మండలి చైర్మన్‌కు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. ఎజెండా లేకపోయినా 18 మంది మంత్రులు సభకు వచ్చి దూషిస్తూ ఉద్రిక్త పరిస్థితులకు కారణం అయ్యారని పేర్కొన్నారు. మంత్రులు వెల్లంపల్లి, అనిల్ వ్యవహరించిన తీరు హేయమైందని విమర్శించారు.
మంత్రి వెల్లంపల్లి తమ సభ్యుడు బీదా రవిచంద్రపై దాడి చేశారని.. ఆత్మరక్షణ కోసం రవిచంద్ర ప్రతిఘటించారని తెలిపారు. మరికొంత మంది మంత్రులు లోకేశ్‌పై దాడికి యత్నించారన్నారు. సభలో వీడియోలు పరిశీలించి బాధ్యులైన సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. వీడియోలను బయటకు విడుదల చేసి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు.
ఇవీ చదవండి...
దాడి చేసినట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమే: మంత్రి అనిల్