ఏపీ ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేస్తూ తెదేపా ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ కేంద్రమంత్రి తోమర్‍కి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా 2వేల500 కోట్ల రూపాయల ఉపాధి హామీ పథకం బకాయిలు చెల్లించడం లేదని లేఖలో పేర్కొన్నారు.
2018-19కి సంబంధించిన ఉపాధి హామీ పథకం బకాయిల కోసం కేంద్రం 1900 కోట్లు రాష్ట్రానికి పంపిందని.., ఆ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకుందని ఆరోపించారు. ఉపాధి హామీ చట్టం కింద సిమెంట్ రోడ్లు వేసిన మాజీ సర్పంచులు, జెడ్పీటీసీలు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: సీఎం జగన్ కేసుల విచారణ ఈ నెల 12కి వాయిదా