TDP MLC Paruchuri Ashok: రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిన ఐఏఎస్‌లు ఎందుకిలా పాలకులు అడుగులకు మడుగులు వత్తుతున్నారని తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసిన చీఫ్ సెక్రటరీలు అందరూ కోర్టు ముందు చేతులు కట్టుకొని నిలబడ్డారని మండిపడ్డారు. చట్టాలను ఏ రకంగా అమలుచేయాలో పాలకులకు చెప్పాల్సినవారే ఆ చట్టాలను కబళిస్తున్నవారికి సహకరిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో తలబిరుసుగా మాట్లాడిన ఐఏఎస్‌లు.. ఇప్పుడెందుకు తల దించుకుంటున్నారో ఆలోచించుకోవాలని హితవు పలికారు. ఐదేళ్ల అధికారం ముందు 30 ఏళ్ల ప్రజాసేవ బానిస కావడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు.
TDP MLC Paruchuri Ashok: ఐఏఎస్, ఐపీఎస్‌లు తల్చుకుంటే ముఖ్యమంత్రులవుతారనీ.. ముఖ్యమంత్రులు ఐఏఎస్‌లు కాలేరని ఆక్షేపించారు. 8 మంది ఐఏఎస్ అధికారులు న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడటం.. రాష్ట్రప్రజలకే అవమానమన్నారు. చంద్రబాబు బస్సుపై రాళ్లు విసిరినప్పుడే సవాంగ్.. నిజమైన డీజీపీగా వ్యవహరించి ఉంటే నేడు అప్రాధాన్య పోస్టులో ఉండేవాడు కాదన్నారు.
ఇదీ చదవండి: ఏపీలో రాముడికి అవమానమంటూ సునీల్ దేవ్‌ధర్ ట్వీట్.. అదేం లేదన్న పోలీసులు.. అసలేం జరిగింది..?