ఉద్యోగాల కోసం పోరుబాట పట్టిన నిరుద్యోగులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని.. వాటిని ఎత్తివేయాలని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు డిమాండ్ చేశారు. అసత్య హామీలతో మోసం చేసిన సీఎం జగన్‌పైనే కేసు పెట్టాలని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. ఉద్యోగాలిచ్చి ఉపాధి చూపాలని అడిగినవారిపై కేసులు పెట్టడం దుర్మార్గమని దుయ్యబట్టారు.
సీఎం జగన్.. ఎన్నికల్లో ఇచ్చిన 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ హామీని నిలబెట్టుకోమని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి తన ఇంటి చుట్టూ ఉన్న పేదల ఇళ్లను కూల్చటంపై ఉన్న శ్రద్ధ.. ఉద్యోగాల కల్పనపై లేదన్నారు. కేసులు, అక్రమ అరెస్టులతో నిరుద్యోగుల పోరాటం ఆగదని స్పష్టం చేశారు. హామీలు విస్మరించి ప్రజలను సీఎం మోసగించారని మంతెన విమర్శలు చేశారు.
ఇదీ చదవండి:
Achenna: నిధులున్న కార్పొరేషన్లన్నీ సీఎం సొంత వర్గానికే: అచ్చెన్న