ప్రభుత్వ అధికారులు, పాలకులు ప్రజల తలల పైకెక్కి ఆడుతున్నారని తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మండిపడ్డారు. అధికారపక్షం 151 మంది ఎమ్మెల్యేలున్నారని విర్రవీగుతుంటే... వారికి అధికారులు వత్తాసు పలుకుతూ వ్యవస్థల నాశనానికి తమ వంతు సహకరిస్తున్నారని దుయ్యబట్టారు. పాలకుల అండ చూసుకుని తప్పుల మీద తప్పులు చేసిన అధికారులపై... ఎస్ఈసీ ఆరంభంలోనే చర్యలు తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఇదే జరిగి ఉంటే ఇప్పుడు వారంతా ఎస్ఈసీని ధిక్కరించే పరిస్థితి ఉండేది కాదని దీపక్ రెడ్డి అన్నారు. వ్యాక్సినేషన్‌ను ఎన్నికలకు అడ్డుగా అధికారులు ఎలా చెబుతారని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ పరిశీలకులు, బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను ఆయన కోరారు.
ఇదీ చదవండి