ఎస్ఈసీ అంశంపై వైకాపా ఎంపీ విజయసాయి చేసిన ట్విట్లపై తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శలు గుప్పించారు. సుమోటో అనే పదం వైకాపాకు అర్థం కాకపోవడం ఏంటి సాయిరెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమోటోగా 16 నెలలు జైలు జీవితం, 11 కేసుల్లో ఏ1, ఏ2 ముద్దాయిలుగా ఎదగడం ఇవ్వన్నీ సుమోటోగా స్వయంకృపరాదాలే కదా అని ఎద్దేవా చేశారు. విశాఖ పర్యటన సందర్భంగా సీఎం జగన్ సుమోటోగా మిమ్మల్ని కారులోంచి దించేశారు కాదా అంటూ గుర్తు చేశారు. సుమోటోగా అల్జిమర్స్ వ్యాధి తెచ్చుకున్నారా సాయిరెడ్డి గారు..? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
రాజ్యాంగాన్ని అవమానపర్చడమే:జవహర్
అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని, హై కోర్టు తీర్పుని అవమానించే స్థాయికి జగన్ ఎదిరిగారని మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. కోర్టు తీర్పును ధిక్కరిస్తూ అర్ధరాత్రి జీఓలు,నియామకాలు చేపట్టడం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడమేనని మండిపడ్డారు. కోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా వైకాపా ప్రభుత్వం తప్పుడు మార్గంలో వెళ్తోందని జవహర్ దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: