గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ వ్యవసాయానికి మీటర్లు పెట్టడానికి వ్యతిరేకం అనలేదా అని ప్రశ్నించారు. విద్యుత్‌కు.. ఉచిత విద్యుత్‌కు ఏ మాత్రం తేడా తెలియని వ్యక్తి వల్లభనేని వంశీ అని విమర్శించారు. ఒక్కరోజు అయినా నియోజకవర్గంలోని సమస్యల గురించి మాట్లాడారా అని నిలదీశారు. రైతులపై వంశీకి ఏ మాత్రం సానుభూతి ఉన్నా సీఎం జగన్‌ను నిలదీయాలని సవాల్ విసిరారు. రైతుల్లో వస్తున్న వ్యతిరేకతతో వైకాపా నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
వంశీ.. రైతులపై సానుభూతి ఉంటే సీఎంను నిలదీయాలి: ఎమ్మెల్సీ బచ్చుల - వంశీపై ఎమ్మెల్సీ అర్జునుడు ఫైర్
విద్యుత్‌కు.. ఉచిత విద్యుత్‌కు ఏ మాత్రం తేడా తెలియని వ్యక్తి వల్లభనేని వంశీ అని తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు విమర్శించారు. వ్యవసాయానికి మీటర్లు పెట్టే అంశంలో రైతులపై వంశీకి ఏ మాత్రం సానుభూతి ఉన్నా సీఎం జగన్‌ను నిలదీయాలని సవాల్ విసిరారు.