దేశంలో తొలిసారి రివర్స్ పీఆర్సీ రాష్ట్రంలోనే చూస్తున్నామని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు విమర్శించారు. ఐఆర్ 27 శాతం ఉంటే.. 14 శాతం ఫిట్మెంట్ చాలని నివేదిక ఇవ్వడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్ కమిటీ నివేదిక ప్రభుత్వ సూచనల ఆధారంగానే ఇచ్చారని స్పష్టమవుతుందని అశోక్ బాబు అన్నారు. తెదేపా ప్రభుత్వంలో 43 శాతం కావాలని అడిగామని.. ఇబ్బందులు ఉన్నా నాడు ఇచ్చారని గుర్తు చేశారు.
జీతాలు పెంచమని అడిగితే.. తగ్గిస్తామని అధికారులు చెప్పడం విచిత్రంగా అశోక్ బాబు అన్నారు. 2022 అక్టోబర్ నుంచి పీఆర్‌సి ఇస్తామని చెప్పడం విడ్డూరమన్నారు. ప్రభుత్వం తెచ్చిన ఆర్టీసి విలీనం, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల వ్యవస్థ వల్లనే ఖజానాపై రూ.6700 కోట్ల భారం పెరిగిందని ఆరోపించారు. కేసిఆర్ ఇంట్లో భోజనం చేసే జగన్.. తెలంగాణ నుంచి 9, 10 షెడ్యూల్ ఆస్తులు తీసుకురాలేరా అని అశోక్‌బాబు ప్రశ్నించారు.
ఇదీ చదవండి: