ETV Bharat / city

Tdp letter to sec: రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెదేపా లేఖ - తెదేపా తాజా సమాచారం

రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెదేపా లేఖ(Tdp letter to sec) రాసింది. ఈ నెలలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల కోడ్ పక్కాగా అమలయ్యేలా చూడాలని ఎస్ఈసీకి తెదేపా విజ్ఞప్తి చేసింది. గత అనుభవాల దృష్ట్యా ఈ సూచనలు పరిగణలోకి తీసుకోవాలని కోరింది.

Tdp
Tdp
author img

By

Published : Nov 2, 2021, 9:58 PM IST

Updated : Nov 2, 2021, 10:43 PM IST

రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెదేపా లేఖ(Tdp letter to sec) రాసింది. ఈ నెలలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections )కు ఆన్​లైన్​లో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. నామినేషన్ల ఉప సంహరణ సమయంలో అభ్యర్థులతో పాటు ఇతర వ్యక్తులను సాక్షులుగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబులు లేఖలో పేర్కొన్నారు.రాష్ట్రంలో ఎన్నికల కోడ్ పక్కాగా అమలయ్యేలా చూడాలని ఎస్ఈసీకి విజ్ఞప్తి చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

నామినేషన్ పత్రాలు స్కాన్ చేసుకుని సంబంధిత అధికారులకు అభ్యర్థులు ఈ మెయిల్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని నేతలు విజ్ఞప్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికల్లో వాలంటీర్ల జోక్యం లేకుండా చూడాలన్నారు. బలవంతపు ఏకగ్రీవాలను పరిగణలోకి తీసుకోవద్దన్నారు.సవరించిన ఓటర్ల జాబితా అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంచాలన్నారు. కోవిడ్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాలు పెంచాలని పేర్కొన్నారు గత అనుభవాల దృష్ట్యా ఈ సూచనలను పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెదేపా(Tdp) విజ్ఞప్తి చేసింది.

ఇదీ చదవండి: AP Local Body Elections: ఆ స్థానాలకు నోటిఫికేషన్.. అమల్లోకి ఎన్నికల కోడ్

Last Updated : Nov 2, 2021, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.