ప్రభుత్వ జీవోల ఆఫ్‌లైన్ వ్యవహారంపై తెదేపా నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. ఈ మేరకు సాయంత్రం 5.15 నిమిషాలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను తెదేపా నేతలు వర్ల రామయ్య, గద్దె రామ్మోహన్, బోండా ఉమ తదితర నేతలు కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు.
జీవోలు ఆన్లైన్లో ఉంచరాదని ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న బ్లాంక్, రహస్య జీవోలపై గతంలో గవర్నర్‌కు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి