ETV Bharat / city

TDP ON PRC: ఉద్యోగుల పట్ల ప్రభుత్వ తీరు దుర్మార్గం: యనమల రామకృష్ణుడు

TDP ON PRC: ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరి దుర్మార్గమని శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. రెండున్నరేళ్ల జగన్ పాలనలో ఉద్యోగులకు ఒరిగిందేంటని ప్రశ్నించారు.

యనమల రామకృష్ణుడు
యనమల రామకృష్ణుడు
author img

By

Published : Jan 19, 2022, 3:53 PM IST

TDP ON PRC: ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరి దుర్మార్గమని శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. రెండున్నరేళ్ల జగన్ పాలనలో ఉద్యోగులకు ఒరిగిందేంటని ప్రశ్నించారు. ఐఆర్ కంటే తక్కువ ఫిట్​మెంట్ చరిత్రలో ఉందా అని నిలదీశారు. అశుతోష్ మిశ్రా కమిటీ సిఫారసులు ఏమయ్యాయన్నారు. తెదేపా పాలనలో 62 జీవోలిచ్చి ఉద్యోగుల సంక్షేమానికి బాటలు వేశామని స్పష్టం చేశారు. నేడు నాలుగు జీవోలతో ఆ సంక్షేమానికి బీటలు వాటిల్లేలా వ్యవహరించారని ధ్వజమెత్తారు. నాడు డీఏ 9 శాతం నుంచి 30 శాతానికి పెంచామని గుర్తు చేసిన యనమల.. రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర ఆర్థిక ఇబ్బందులున్నా ఉద్యోగుల శ్రేయస్సును దృష్ట్యా 43 శాతం ఫిట్​మెంట్ ఇచ్చినట్లు తెలిపారు.

72వ డిమాండ్ వైకాపా ప్రభుత్వం అమలు చేసింది:నక్కా ఆనంద్​బాబు

రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి పేరివిజన్ కు బదులు పేరివర్స్ చేశారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు దుయ్యబట్టారు. ఉద్యోగులు 71 డిమాండ్లు ప్రభుత్వం ముందుంచితే, 72వ డిమాండ్ ఈ ప్రభుత్వం అమలుచేసిందని మండిపడ్డారు. ఉద్యోగులు దారుణంగా నష్టపోవడానికి నాయకత్వలోపమే కారణమన్నారు. ముఖ్యమంత్రిని కలవలేని దుస్థితిలో సంఘనేతలు ఉండటం, పీఆర్సీ కమిషన్ నివేదిక చేతికి రాకపోవడం కంటే అవమానం ఉంటుందా అని నక్కాఆనంద్‌బాబు ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

ఎన్నికల వేళ కలకలం.. సీఎం మేనల్లుడి ఇంట్లో రూ.8కోట్లు సీజ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.