ETV Bharat / city

పంచాయతీ ఎన్నికలు: "ప్రజాస్వామ్య చరిత్రలో ఓ చారిత్రాత్మక తీర్పు" - సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన అచ్చెన్నాయుడు

పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న సుప్రీం కోర్టు తీర్పుపై పలువురు తెదేపా నాయకులు సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పు అంబేడ్కర్ రచించిన రాజ్యంగ విజయమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.

సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన అచ్చెన్నాయుడు

author img

By

Published : Jan 26, 2021, 1:14 PM IST

సుప్రీం కోర్టు తీర్పు రాజ్యాంగ విజయం: అచ్చెన్నాయుడు

పంచాయితీ ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ విజయమని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. "ఎవ్వరైనా రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి అనుగుణంగా నడుచుకోవాల్సిందేనని మరోసారి రుజువైంది. పాలకుడైనా.. పౌరుడైనా రాజ్యాంగ విలువలకు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించాల్సిందే. అతీత శక్తిగా వ్యవహరిస్తే ఎదురు దెబ్బలు తప్పవని జగన్ రెడ్డి ఇప్పటికైనా గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగులు కూడా రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం కాకుండా, ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా పనిచేయాలి. ప్రజలు, వ్యవస్థలు మాత్రమే శాశ్వతం తప్ప ప్రభుత్వాలు కాదని ఉద్యోగ సంఘ నాయకులు తెలుసుకోవాలి. జగన్ రెడ్డి కోసం పని చేయాలనుకుంటే రాజ్యాంగం చేతుల్లో చెప్పు దెబ్బలు తప్పవని గ్రహించాలి. కోర్టులతో చివాట్లు తింటున్న జగన్ రెడ్డి వెంట నడుస్తారో లేక ప్రజాస్వామ్య హితులుగా నిలుస్తారో నిర్ణయించుకోవాలి." అని హితవు పలికారు.

'లా' ఇలా ఉందంటే మా'లా'గే వెళ్తామనటం శోచనీయం: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

"ప్రజాస్వామ్య చరిత్ర లో ఓ చారిత్రాత్మక తీర్పు సుప్రీం కోర్టు ఇచ్చింది. ప్రభుత్వం ఇప్పటికైనా వితండవాదం మాని ఎన్నికలకు సహకరించాలి. సహాయనిరాకరణ చేసిన ఉద్యోగుల సంఘంపై చర్యలు తీసుకోవాలి." -ట్విట్టర్ లో తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి

బెంచ్ మారినా పంచ్ మారలేదు: వంగలపూడి అనిత

"బెంచ్ మారినా పంచ్ మారలేదు. డేట్ మారినా ఫేట్ మారలేదు. పెద్ద కోర్ట్ కి పోయినా తిట్లు తప్పలేదు. అన్నయ్య ఇంట్లో పగిలిన మరో టీవి. ఏ1 రెడ్డి ఓదార్పు యాత్రకు బయల్దేరిన ఏ2 రెడ్డి." -ట్విట్టర్ లో తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత

ఏమాత్రం మానాభిమానాలున్నా రాజీనామా చేయాలి: గన్ని కృష్ణ

సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై వైకాపా ప్రభుత్వానికి ఏమాత్రం మానాభిమానాలున్నా తక్షణం రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని తెదేపా అధికార ప్రతినిధి గన్నికృష్ణ డిమాండ్ చేశారు. "ఎన్నికల నిర్వహణకు కేంద్ర సిబ్బంది సాయం కోరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సరైన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగసంఘాలు ఇకనైనా ఇంగితం తెచ్చుకోవాలి" అని ఓ ప్రకటనలో వ్యాఖ్యానించారు.

సుప్రీం తీర్పు చెంపపెట్టు: కాలవ శ్రీనివాసులు

పంచాయతీ ఎన్నికల నిర్వహణ పై సుప్రీం కోర్టు తీర్పు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవశ్రీనివాసులు విమర్శించారు. రాజ్యాంగ ధర్మాలను నిర్వర్తించడంలో గవర్నర్ విఫలమయ్యారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని జగన్ ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని ధ్వజమెత్తారు. ధర్మం, న్యాయం రక్షించబడతాయనడానికి... ఈ తీర్పు నిదర్శనమన్నారు.

రాజ్యాంగ ధర్మాలను నిర్వర్తించడంలో గవర్నర్ విఫలమం...

పంచాయతీ ఎన్నికల నిర్వహణ పై సుప్రీం కోర్టు తీర్పు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ "రాజ్యాంగ ధర్మాలను నిర్వర్తించడంలో గవర్నర్ విఫలమయ్యారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని జగన్ ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది. ధర్మం, న్యాయం ఎక్కడో చోట రక్షించబడతాయనడానికి ఈ తీర్పు నిదర్శనం.

కొందరు ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగుల మనోభావాలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి మెప్పు కోసం విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు. రాజ్యాంగ ధర్మాలను నిర్వర్తిస్తామని అధికారులు చేసిన ప్రమాణాలు గుర్తులేదా. ఇప్పటికైనా ఎన్నికలు నిష్పక్షపాతంంగా జరిగేందుకు అధికార యంత్రాంగం కృషి చేయాలి. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి." అని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

సుప్రీం తీర్పుతో మొదలైన పంచాయతీ ఎన్నికల ప్రక్రియ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.