ప్రేమించి మోసం చేశాడని....తనకు న్యాయం చేయాలని కోరుతూ....పోలీసులను ఆశ్రయించిన ఎస్సీ యువతి ఇంటికి నిప్పుపెట్టడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు బాధిత యువతిని, కుటుంబాన్ని పరామర్శించేందుకు చలో అయినంపూడికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా... మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎస్సీ సంఘాల నేతలు.... వర్ల రామయ్య నివాసానికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను గొల్లపూడిలో పోలీసులు అడ్డుకున్నారు. దీనిని.... తీవ్రంగా ఖండించిన సౌమ్య.... ఎవరు అడ్డుకున్నా న్యాయం జరిగే వరకు నిరసనలు ఆగవని స్పష్టంచేశారు.
వైకాపా అధికారంలోకి వచ్చాక ఎస్సీలపై దాడులు అధికమయ్యాయని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. ఎస్సీలపై వరుస దాడులు జరుగుతున్నా.... ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని మండిపడ్డారు. చలో ఐనంపూడిని అడ్డుకోవడం దుర్మార్గమని దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధ్యుల అరెస్ట్‌పై పోలీసు యంత్రాంగం స్పష్టమైన సమాచారమివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
వైకాపా ఏడాది పాలనలో ఎస్సీలపై సుమారు 150కి పైగా దాడులు జరిగాయని నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు ఎస్సీలపై జరిగిన దాడులన్నింటిపైనా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. న్యాయం జరగకపోతే ఎస్సీ, ప్రజా సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. అయినంపూడిలో ఎస్సీ మహిళపై సజీవ దహనానికి యత్నించారని ఆరోపించారు.
చలో అయినంపూడికి పిలుపునిస్తే ప్రభుత్వం అడ్డుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.ఎస్సీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం....ఇప్పుడు వారికి న్యాయం చేయడంలో ఆలస్యం చేస్తోందని విమర్శించారు. బడుగు బలహీన వర్గాలపై దాడులకు అడ్డుకట్టపడేదాక..... తెదేపా పోరాడం కొనసాగుతుందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: రాజధాని రైతుల ఆకాంక్షలు కళ్లకు కట్టేలా.. తెలంగాణ పాత్రికేయుడి లఘు చిత్రం