తూర్పుగోదావరి జిల్లాలో..
మూడు రాజధానులకు అనుకూలంగా గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలో తెలుగుదేశం నాయకులు నిరసన తెలిపారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. 'మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు' అంటూ నినాదాలు చేశారు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 3 రాజధానుల ఆలోచనతోనే ఉన్నారని తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఎన్నికలకు ముందు రాజధానిని అమరావతిలోనే కొనసాగిస్తానని చెప్పి.. ఇప్పుడు మాట మార్చారని విమర్శించారు. భూములిచ్చిన రైతుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించటాన్ని వ్యతిరేకిస్తూ.. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో గాంధీ విగ్రహం వద్ద తెదేపా నేతలు నిరసన వ్యక్తం చేశారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి... గవర్నర్ నిర్ణయానికి నిరసనగా, నలుపు రంగు దుస్తులు ధరించి.. ఆందోళనలో పాల్గొన్నారు. మూడు రాజధానులు వద్దంటూ నినాదాలు చేశారు. అతి పవిత్రంగా భావించే వరలక్ష్మి వ్రతం రోజున గవర్నర్ మూడు రాజధానుల బిల్లును ఆమోదించటం.. దుర్మార్గమైన చర్యన్నారు. నిన్న ఆంధ్రప్రదేశ్‌కు బ్లాక్‌డే గా మిగిలిపోతుందని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
మూడు రాజధానుల బిల్లు ఆమోద్రముద్రను వెంటనే వెనక్కి తీసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గ తెదేపా నేతలు డిమాండ్ చేశారు. వికేంద్రీకరణ బిల్లు ఆమోదాన్ని నిరసిస్తూ.. కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు మండలాల్లో తెదేపా నాయకులు ఎన్టీఆర్ విగ్రహాల వద్ద ఆందోళన చేశారు.
అనంతపురం జిల్లాలో..
ప్రస్తుతం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలా వినాశనానికే ప్రయత్నిస్తోందని కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఉమామహేశ్వర్ నాయుడు ఆరోపించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆందోళన నిర్వహించారు. ఎన్టీఆర్ భవన్ నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు.
చిత్తూరు జిల్లాలో..
పుత్తూరులో తెదేపా నాయకులు మూడు రాజధానులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్వేటినగరం కోటలోని అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
తన శాసనమండలి సభ్యత్వ రాజీనామాకు, చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని.. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశానని బీటెక్ రవి స్పష్టం చేశారు. మూడు రాజధానుల నిర్ణయం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కడపలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. అమరావతిని రాజధానిగా రాష్ట్ర ప్రజలందరూ ఒప్పుకున్నారన్నారు. ఓవైపు కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే.. ఈ సమయంలో మూడు రాజధానుల విషయాన్ని తెరపైకి తీసుకురావడం తగదన్నారు. సీఎం జగన్ వ్యక్తిగత కక్షతోనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ ఆమోదం లభించినప్పటికీ మూడు రాజధానులు చేయడం అంత తేలిక కాదని వ్యాఖ్యానించారు. అమరావతి కోసం తామంతా పోరాటం చేస్తామని తెలిపారు.
మూడు రాజధానులకు ఆమోదం తెలపటంపై..చంద్రగిరి నియోజకవర్గ తెదేపా నేతలు మండిపడ్డారు. మూడు రాజధానులు వద్దంటూ నినాదాలు చేశారు. మూడు రాజధానుల అంశంపై గవర్నర్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని న్యాయ స్థానం కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో..
మూడు రాజధానులకు వ్యతిరేకంగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ ఆందోళన చేపట్టారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో పడుతుందని హెచ్చరించారు. మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడం సరికాదన్నారు. కక్షసాధింపు చర్యలో భాగంగానే జగన్ ఇలా చేస్తున్నారని విమర్శించారు. దీనిపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
మూడు రాజధానులు వద్దు.. ఒక రాజధానే ముద్దు అంటూ శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో తెదేపా నేతలు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా తెదేపా నాయకుడు, కూన రవికుమార్ మాట్లాడుతూ.. మూడు రాజధానుల వలన రాష్ట్రం సమస్యల్లో ఇరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదం తెలపటం విచారకరమన్నారు.
కృష్ణా జిల్లాలో..
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ.. మూడు రాజధానులు చేయాలి అనే ఆలోచనతోనే ఉన్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ఆక్షేపించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజధానిని అమరావతిలోనే కొనసాగిస్తాను అని చెప్పి.. ఎన్నికలు ముగిసి ముఖ్యమంత్రి అయిన తరువాత మాటా మార్చారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు రాజధాని అమరావతిలో ఉంటుంది, అందుకే తాను స్ధిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నాను అన్న జగన్.. ఇప్పుడు మడమ తిప్పారని మండిపడ్డారు. భూములిచ్చిన రైతులు ఉద్యమిస్తే వారి సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా జగన్ వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని మార్పుపై ఉన్న శ్రద్ధ ప్రజలను పట్టించుకోవడంపై లేదని చినరాజప్ప విమర్శించారు.
అనంతపురం జిల్లాలో..
ప్రస్తుతం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలా వినాశనానికే ప్రయత్నిస్తోందని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛా ర్జి ఉమామహేశ్వర్ నాయుడు ఆరోపించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
ప్రకాశం జిల్లాలో...
మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించడాన్ని నిరసిస్తూ ప్రకాశం జిల్లాలో తెలుగు దేశం నాయకులు ఆందోళన చేశారు. వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులకు అన్యాయం చేయటంతో పాటు.. అన్ని ప్రాంతాల వారికీ ఆమోద్యయోగ్యమైన అమరావతిని నిర్వీర్యం చేయటం.. నిరంకుశ ఆలోచనలకు పరాకాష్ట అంటూ తెలుగు దేశం నేతలు మండిపడ్డారు.
ఇవీ చదవండి..