రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను తెదేపా నేతల బృందం కలిసింది. అమరావతి పర్యటనలో చంద్రబాబు కాన్వాయ్‌పై జరిగిన దాడి ఘటనను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై పోలీసులు తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని ఫిర్యాదు చేసింది. ఘటనపై పోలీసులకు ఆదేశాలు ఇస్తానని.. గవర్నర్ స్పష్టం చేసినట్లు తెదేపా నేతలు వెల్లడించారు.
వాస్తవాలు తెలియజేసేందుకే పర్యటన..
రాజధానిపై సీఎం, మంత్రులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని తెదేపా సీనియర్ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకే చంద్రబాబు అమరావతిలో పర్యటించారని తెలిపారు. పోలీసుల కుట్రతోనే చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లతో దాడి జరిగిందని ఆరోపించారు. మంత్రి కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మహిళను అరెస్టు చేశారని.. తన బాధ చెప్పుకున్న ఆమెను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. అసభ్య పదజాలం వాడిన కొడాలి నానిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు పర్యటనలో వాడిన బస్సులు సీజ్ చేశారని... బస్సు డ్రైవర్, కండక్టర్‌ను అదుపులోకి తీసుకుని ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ వాస్తవాలు గ్రహించి తమ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: