ఉద్యోగులకు ఈసారి కూడా జీతాల్లో కోతపెట్టడాన్ని తెదేపా నేతలు తప్పుబట్టారు. నిధులు లేవని అంటున్న ముఖ్యమంత్రి జగన్... కాంట్రాక్టర్ మెగా రామకృష్ణారెడ్డికి చెల్లించడానికి 6,400 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చారని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. జగన్ తన అభిమాన కాంట్రాక్టర్లకు డబ్బులిస్తున్నారని .. గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. 1400 కోట్ల రూపాయలు మాత్రమే సున్నా వడ్డీకి కేటాయించి, 6400 కోట్లు కాంట్రాక్టర్లకు, కాలేజీలకు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు.
ఈ క్లిష్ట సమయంలోనే కాంట్రాక్టర్లకు ఇచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 50 శాతం కోత పెట్టడమేంటని ప్రశ్నించారు. 10 వేల జీతం వాడికి 50 శాతం కోత పెట్టి.. సీఎం నియమించుకున్న 40 మందికి పైగా సలహాదారులు ఒక్కొక్కరికీ నెలకు లక్షల్లో జీతం చెల్లిస్తున్నారని మాజీ మంత్రి జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 40 మంది సలహాదారులకు జీతాలు ఆపితే 1200 మంది చిరుద్యోగులకు ఇవ్వొచ్చని ఆయన హితవు పలికారు.
ఇవీ చదవండి: