ETV Bharat / city

CHINARAJAPPA : "రాధాను హత్య చేసి.. రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు.." - chinarajappa

వంగవీటి రాధాను హత్య చేసి.. రాజకీయంగా వాడుకోవాలని జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప సంచలన ఆరోపణలు చేశారు. విజయవాడలో పాత రోజులు పునరావృతం అయ్యేలా కనిపిస్తున్నాయని బుద్దా వెంకన్న ఆందోళన వ్యక్తంచేశారు.

వైకాపా నేతలు తెదేపా ఆగ్రహం
వైకాపా నేతలు తెదేపా ఆగ్రహం
author img

By

Published : Dec 29, 2021, 8:13 PM IST

వంగవీటి రంగా హత్యను.. తెదేపాకు ఆపాదించి, కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. తెదేపా యువ నాయకుడిగా ఉన్న రాధాను హత్య చేసి, రాజకీయంగా వాడుకోవాలని జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాధా హత్యకు రెక్కీ నిర్వహించిన అరవ సత్యం.. విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడరే అని అన్నారు. రంగా హత్యకేసులో ప్రధాన ముద్దాయి అయిన దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్ కు వైకాపాలో పెద్ద పీట వేశారని పేర్కొన్నారు.

ఇప్పటికైనా మానండి..
వంగవీటి రంగా హత్యకు, తెదేపాకు సంబంధం లేదని ఆయన కుమారుడు, తెలుగుదేశం పార్టీ యువనేత వంగవీటి రాధా బహిరంగంగా ప్రకటించారని చినరాజప్ప గుర్తు చేశారు. వంగవీటి రాధా ఎక్కడున్నా, ఏ పార్టీలో ఉన్నా ఆహ్వానిస్తామన్న వైసీపీ నేతలు.. అతని హత్యకు రెక్కీ నిర్వహించిన అరవ సత్యం, అతన్ని ప్రోత్సహించిన దేవినేని అవినాష్ ను తమ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని నిలదీశారు. ఇప్పటికైనా.. కుల రాజకీయాలు, కుట్ర రాజకీయాలు మానుకోవాలని చినరాజప్ప హితవు పలికారు.

కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలి..
విజయవాడలో పాత రోజులు పునరావృతం అయ్యేలా కనిపిస్తున్నాయని తెదేపా నేత బుద్దా వెంకన్న ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇల్లు, తెదేపా పార్టీ కార్యాలయంపై దాడి ఘటనలు ఈ ఆందోళనలకు ఊతం ఇస్తున్నాయని అన్నారు. తెదేపా కార్యాలయంపై దాడి జరిగిన రోజే.. వంగవీటి రాధా ఇంటివద్ద రెక్కీ నిర్వహించారని వివరించారు. ఈ ఘటనలు చూసి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, వంగవీటి రాధాకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిజాలు తెలియాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.