ముఖ్యమంత్రి జగన్...రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. అంబేడ్కర్ స్మృతివనానికి చంద్రబాబు శ్రీకారం చుడితే...జగన్ దాన్ని నాశనం చేశారని ఆరోపించారు. ఎన్టీఆర్ తీసుకువచ్చిన చైతన్యంతోనే మహిళలకు ఆస్తిహక్కుతోపాటు పేదల హక్కులు రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. ఎన్టీఆర్ సారథ్యంలోని నేషనల్ ఫ్రంట్ అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చిందని గుర్తుచేశారు. అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో రాజ్యాంగదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్, మాజీమంత్రులు కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్ బాబు, వర్లరామయ్య, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీచదవండి