ETV Bharat / city

' జగన్‌ తొందరపాటుకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు' - ap latest

పోలవరంపై జగన్​ తొందరపాటు నిర్ణయానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టువంటిదని తెదేపా నేతలు అభివర్ణించారు. రాజధానిని ఎక్కడికో తరలిస్తామంటే ఊరుకోబోమని స్పష్టం చేశారు. అమరావతిలో గుంటూరు ఎంపీ గల్లాజయాదేవ్​, మాజీ మంత్రి దేవినేని ఉమ మీడియాతో మాట్లాడారు.

పోలవరంపై హైకోర్టు తీర్పుపై తెదేపా నేతలు
author img

By

Published : Aug 22, 2019, 2:36 PM IST

Updated : Aug 22, 2019, 3:27 PM IST

ఏపీజెన్​కో ఉత్తర్వులను రద్దు చేస్తూ..హైకోర్టు ఇచ్చిన తీర్పు వైకాపా ప్రభుత్వానికి చెంపపెట్టువంటిదని తెదేపా నేతలు గల్లా జయదేవ్​, మాజీ మంత్రి దేవినేని ఉమ అభిప్రాయపడ్డారు. రాజధానిని మారిస్తే..అమరావతికి కేటాయించిన నిధులన్నీ వృథా అవుతాయని వివరించారు.

హైకోర్టు తీర్పుపై తెదేపా నేతలు ఏమన్నారంటే..!

వరదను ప్రభుత్వం సరిగా అంచనా వేయలేదు. 10 వేల ఎకరాలు నీట మునిగాయి. వరదలు మానవ తప్పిదమే. పంట నష్టంతో వేలాది కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇది ప్రభుత్వ వైఫల్యమే.
రాజధాని విషయంలో మంత్రులు ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారు. ప్రధాని, కేంద్ర హోమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని విజయసాయిరెడ్డి అన్నారు. ఆ మాటల్ని భాజపా నేతలు వ్యతిరేకించారు. పెట్టుబడులకు అనుగుణంగా ఉండాలనే అమరావతిని ఎంపిక చేశాం. నిర్మాణం ఆగిపోవాలనే బొత్స ఆ విధంగా వ్యాఖ్యనించారు. ఇప్పటికీ ఖర్చు పెట్టిన నిధులన్నీ వృథానే కదా..! హైటెక్​సిటీ నిర్మించాక చంద్రబాబు దిగిపోతే వైయస్సార్​ వచ్చి ఆ ప్రాజెక్ట్​ ఆపలేదు..జగన్​ ఈ విషయాలను గుర్తించాలి.
--- గల్లా జయదేవ్​, గుంటూరు ఎంపీ.

పోలవరంపై జగన్​ తొందరపాటు నిర్ణయానికి కోర్టు తీర్పు చెంపపెట్టు. పోలవరం పవర్​ ప్రాజెక్ట్​ కొట్టేయాలనే పీటర్​ కమిటీ వేయించారు. ముంపు మండలాలు కలిశాకే ప్రాజెక్ట్​ పనులు ఊపందుకున్నాయి. 2015లో డ్యామ్​ సైట్​లోని ప్రజలకు రూ. 115 కోట్లు పరిహారం ఇవ్వాల్సి వచ్చింది. మేం పోలవరం త్వరగా పూర్తి చేయాలని తపిస్తే..అవినీతి ముద్ర వేయాలని చూశారు.
---- దేవినేని ఉమా మహేశ్వరరావు, మాజీ మంత్రి.

పోలవరంపై రివర్స్​ టెండరింగ్​ రాష్ట్రాభివృద్ధి కాంక్షించే నిర్ణయం కాదని తెదేపా నేత ఆళ్లపాటి రాజా అన్నారు. ప్రాజెక్టులో లేని అవినీతి మరకను చంద్రబాబుపై రుద్దాలనే ఇలా చేశారన్నారు. హైకోర్టు తీర్పుతోనైనా సీఎం జగన్​ కళ్లు తెరవాలని ఆళ్లపాటి అన్నారు.

ఇవీ చదవండి....నవయుగ టెండర్ల రద్దుపై ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

Intro:kit 736
కోసురుకృష్ణమూర్తి, అవనిగడ్డ నియోజక వర్గం
సెల్.9299999511.

కృష్ణా జిల్లా, మోపిదేవి, చల్లపల్లి, అవనిగడ్డ మండలాల్లో అరటి పంటకు రేటు లేక కొనే వారు లేక అరటి తోటలు నరికి వేస్తున్న అరటి రైతులు

వీడియో ఫైల్స్ మరియు స్క్రిప్ట్ FTP ద్వారా పంపడమైనది

Body:కృష్ణా జిల్లా, మోపిదేవి, చల్లపల్లి, అవనిగడ్డ మండలాల్లో అరటి పంటకు రేటు లేక కొనే వారు లేక అరటి తోటలు నరికి వేస్తున్న అరటి రైతులు

Conclusion:కృష్ణా జిల్లా, మోపిదేవి, చల్లపల్లి, అవనిగడ్డ మండలాల్లో అరటి పంటకు రేటు లేక కొనే వారు లేక అరటి తోటలు నరికి వేస్తున్న అరటి రైతులు
Last Updated : Aug 22, 2019, 3:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.