ముఖ్యమంత్రి జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిశారు. తెదేపా అధినేత చంద్రబాబు విశాఖ పర్యటన సందర్భంగా.. పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. అనంతరం నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య మాట్లాడుతూ.. చంద్రబాబును అడ్డుకున్నది విశాఖ ప్రజలు కాదు... 13 జిల్లాల వైకాపా కార్యకర్తలని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. డైరెక్టర్ జనరల్, సీఎం జగన్ ఏం మాట్లాడుకున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. శాంతిభద్రతలను అదుపుచేయడంలో ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించారు. విశాఖలో మొన్నటి ఘటన చూసి దేశమంతా నవ్వుకుందని అన్నారు. చంద్రబాబుపై కుట్ర పన్ని యాత్రను అడ్డుకున్నారని మండిపడ్డారు.
'చంద్రబాబుపై కుట్రతో యాత్రను అడ్డుకున్నారు' - విశాఖలో పోలీసుల తీరుపై గవర్నర్‌కు తెదేపా నేతల ఫిర్యాదు
విశాఖలో పోలీసుల తీరుపై గవర్నర్ బిశ్వభూషణ్‌కు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి జగన్ కక్షపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. చంద్రబాబుపై కుట్ర పన్ని యాత్రను అడ్డుకున్నారని మండిపడ్డారు.