కరోనా మందుతోనూ వైకాపా నకిలీ వ్యాపారం చేస్తుందని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు(atchannaidu ) మండిపడ్డారు. బ్లాక్ మెయిల్ చేసిన వారిని వదిలి.. ప్రజల తరపున ప్రశ్నించిన సోమిరెడ్డి (somireddy chandramohan reddy) పై కేసు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి పరుల్ని ప్రోత్సహించడమే ధ్యేయంగా వైకాపా పాలన ఉందని ధ్వజమెత్తారు.
ఆనందయ్య మందు (anandaiah medicine) పేరుతో వైకాపా నేతల దొంగ వ్యాపారానికి కుట్ర పన్నుతున్నారన్నారు. ప్రభుత్వం యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘిస్తుందని, కుట్రను బయటపెట్టిన వ్యక్తిపై చీటింగ్, ఫోర్జరీ, దొంగతనం కేసులు పెట్టి బెదిరించిన వాళ్లని, బ్లాక్ మెయిల్ చేసిన వారిని వదిలేస్తారా..? అని ప్రశ్నించారు. ప్యాకెట్ 167రూపాయలకు అమ్మేందుకు శేశ్రిత టెక్నాలజీస్ సంస్థ ప్రయత్నించడం వాస్తవం కాదా..? అని నిలదీశారు. ఆనందయ్య అనుమతి లేకుండా మందు అమ్ముకునేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలేవని ప్రశ్నించారు. సోమిరెడ్డి (somireddy)పై నమోదు చేసిన కేసుల్ని వెంటనే ఎత్తేవేసి మందు దొంగచాటుగా అమ్మేందుకు యత్నించిన వారిపై కేసు నమోదు చేయాలని అచ్చెన్న డిమాండ్ చేశారు.
కాకాణిని అరెస్ట్ చేయాలి: కాలవ శ్రీనివాసులు
ఎమ్మెల్యే కాకాణి(mla kakani govardhan reddy ) పై తెదేపా నేత, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ( kalava srinivasulu) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాణి ప్రమేయంలేకుండానే వెబ్‌సైట్ ప్రారంభించారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి, శేశ్రిత వెబ్‌సైట్‌కి సంబంధం లేకపోతే కాకాణిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాకాణితో పాటు, వెబ్ సైట్ నిర్వాహకులను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. సోమిరెడ్డిపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తేయాలని కోరారు. తెదేపా డిమాండ్లపై స్పందించకుంటే ప్రభుత్వంపై కోర్టుధిక్కరణ కేసులు వేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి