ETV Bharat / city

'చలో ఆత్మకూరు' తెదేపా నేతల అరెస్టులు.. నిర్బంధాలు.. - చలో ఆత్మకూరు తెదేపా నేతల అరెస్ట్

వైకాపా ప్రభుత్వ బాధితుల కోసం తెదేపా తలపెట్టిన 'చలో ఆత్మకూరు' కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కార్యక్రమానికి తరలివస్తున్న తెదేపా నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరనీ.. చలో ఆత్మకూరును నిర్వహించి తీరుతామని నాయకులు ఉద్ఘాటించారు.

'చలో ఆత్మకూరు' తెదేపా నేతల అరెస్టులు.. నిర్బంధాలు..
author img

By

Published : Sep 11, 2019, 1:25 PM IST

తెలుగుదేశం పార్టీ తలపెట్టిన 'చలో ఆత్మకూరు' కార్యక్రమానికి వెళ్తున్న నేతలను, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్​ను గృహనిర్బంధం చేశారు. ముఖ్యనాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు. రామ్మోహన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందనీ.. ఎంతో మంది తెదేపా కార్యకర్తలను చంపేస్తున్నారని ఆరోపించారు. గుంటూరు జిల్లా చింతలపూడిలో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్​ను ఆయన ఇంట్లోనే నిర్బంధం చేశారు. ప్రభుత్వం ప్రజాసమస్యలపై కాకుండా తమపై కక్ష పూర్వకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

విజయవాడ పాత బస్తీ నుంచి ఆత్మకూరు బయలుదేరిన బుద్ధా వెంకన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం గొప్పదనీ.. అధికారంతో వైకాపా తమ ఉద్యమాన్ని అణచివేయలేదని బుద్ధా స్పష్టంచేశారు. ఆత్మకూరు బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామన్నారు. కడప జిల్లాలో కనకమేడల రవీంద్రకుమార్​ను, ఇతర నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. తాను కోర్టుకు వెళ్లాలనీ.. న్యాయస్థానానికి వెళ్లకుండా తనను అడ్డుకోవడం చట్ట ఉల్లంఘన అని మండిపడ్డారు.

విజయవాడలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ తదితరులను గృహనిర్బంధం చేశారు. పలువురు తెదేపా నాయకులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్​స్టేషన్​కు తరలించారు. ప్రభుత్వం అనాగరిక చర్యలు వీడకుంటే ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుందని అర్జునుడు హెచ్చరించారు.

'చలో ఆత్మకూరు' తెదేపా నేతల అరెస్టులు.. నిర్బంధాలు..

ఇవీ చదవండి..

ఆత్మకూరులో ఉద్రిక్తత​..భారీగా మోహరించిన పోలీసులు

Intro:Body:

nagamani

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.